Pushpa 2 Update: క్రేజీ అప్డేట్.. ‘పుష్ప-2’ రిలీజ్ డేట్ ఇదే!
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ‘పుష్ప ది రూల్’
- By Balu J Published Date - 02:33 PM, Wed - 16 November 22
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ‘పుష్ప ది రూల్’ పార్ట్ 2తో తిరిగి రాబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మొదటి భాగం బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో స్వీక్వెల్ పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని 2024 ప్రారంభంలో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
“పుష్ప: ది రైజ్ కంటే పుష్ప 2ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు సుకుమార్ ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఆయన బ్యాంకాక్, ఇతర ప్రదేశాలలో టెస్ట్ షూట్లను ప్లాన్ చేశాడు. స్టోరీ అయినా, లోకేషన్స్ అయినా సుక్కుకు నచ్చితేనే చిత్ర యూనిట్ ముందుకువెళ్తోంది. డిసెంబరు మొదటి వారంలో చివరి షూట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది” అని తెలుస్తోంది.
“సుకుమార్ ఈ చిత్రాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతుండటంతోనే పార్ట్-2 ఆలస్యమవుతోందని తెలుస్తోంది. షూట్‌ని త్వరగా పూర్తి చేయడానికి సుకుమార్ ఇష్ట పడటం లేదని టీం చెబుతోంది. అందుకే మేకర్స్ ప్రస్తుతానికి పుష్ప 2ని 2024 మార్చి-ఏప్రిల్ లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని లేటెస్ట్ టాక్. ఈ సీక్వెల్ తోనే పుష్పరాజ్ జీవితానికి తెరపడుతుందని, అతని బాల్యం, తండ్రి, తోబుట్టువులతో ఉన్న సంబంధాలు పుష్ప 2లో చూపించనున్నారని తెలుస్తోంది.
Related News
Pushpa 2 : పుష్ప 2.. మరోటి రెడీ చేస్తున్నారట..!
Pushpa 2 అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు. సినిమా మీద ఉన్న అంచనాలకు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నారు మేకర్స్.