Mahesh Guntur Karam : గుంటూరు కారం బ్లాక్ బస్టర్ అంతే.. నిర్మాత కామెంట్స్ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి..!
Mahesh Guntur Karam సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా 2024 సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేసిన
- By Ramesh Published Date - 11:19 AM, Thu - 23 November 23

Mahesh Guntur Karam సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా 2024 సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. హారిక హాసిని బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి.
ఆదికేశవ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో గుంటూరు కారం గురించి కూడా మాట్లాడిన నాగ వంశీ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం అంతే అని అన్నారు. నిర్మాత జర్నలిస్ట్ లతో సినిమా రివ్యూస్ గురించి మాట్లాడుతూ రిలీజ్ అయిన ఒక రోజైనా రివ్యూస్ ఇవ్వడం ఆపాలని అన్నారు. రివ్యూస్ వల్ల సినిమాలకు ఎఫెక్ట్ పడుతున్న విషయంపై నిర్మాతలు డిస్కషన్స్ చేస్తున్నారు.
ఆదికేశవ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కూడా నాగ వంశీ రివ్యూస్ గురించి ప్రస్తావించారు. అంతేకాదు గుంటూరు కారం సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అన్నారు. మహేష్ త్రివిక్రం ఇద్దరు కలిసి అతడు, ఖలేజా సినిమాలు చేశారు. ఇద్దరు కలిసి చేస్తున్న హ్యాట్రిక్ సినిమా గుంటూరు కారం. ఈ సినిమా తప్పకుండా సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందని చెబుతున్నారు.
థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన ధం బిర్యాని సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. తప్పకుండా ఈ సినిమా కూడా ఆ సాంగ్ రేంజ్ లో భారీ హిట్ టార్గెట్ తో వస్తుందని చెప్పొచ్చు.
Also Read : CNG Prices: పెరిగిన సీఎన్‌జీ ధరలు.. ఎక్కడంటే..?
We’re now on WhatsApp : Click to Join