Priyanka -Shiva : నడి రోడ్ పై రెచ్చిపోయిన ప్రియాంక జైన్- శివ కుమార్ జంట..ఏంటి ఈ రొమాన్స్
Priyanka -Shiva : తాజాగా న్యూయార్క్ వీధుల్లో ఈ జంట రొమాంటిక్ ఫొటోషూట్ నెట్టింట్లో వైరల్ అయింది. రోడ్డు మీదే ప్రియాంకను ముద్దుపెడుతూ శివ కుమార్ ఇచ్చిన పోజులు ఇప్పుడు యువతలో చర్చనీయాంశంగా మారాయి
- By Sudheer Published Date - 05:02 PM, Wed - 23 July 25

‘మౌనరాగం’ సీరియల్ ద్వారా గుర్తింపు పొందిన ప్రియాంక జైన్, శివ కుమార్ (Priyanka Jain-Shiva) జంట సోషల్ మీడియాలోను ట్రెండింగ్‌లో నిలుస్తుంటారు. గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ప్రస్తుతం లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు స్వయంగా ప్రకటించిన వీరు, తమ ప్రేమను సోషల్ మీడియాలో తరచూ ప్రదర్శిస్తూ అభిమానులను అలరిస్తుంటారు.
తాజాగా న్యూయార్క్ వీధుల్లో ఈ జంట రొమాంటిక్ ఫొటోషూట్ నెట్టింట్లో వైరల్ అయింది. రోడ్డు మీదే ప్రియాంకను ముద్దుపెడుతూ శివ కుమార్ ఇచ్చిన పోజులు ఇప్పుడు యువతలో చర్చనీయాంశంగా మారాయి. స్టైలిష్ దుస్తుల్లో, ప్రేమలో మునిగిపోయిన ఈ జంట ఫొటోలు సినిమాకే మించిన రొమాన్స్‌ను తలపిస్తున్నాయి. వీరి కెమిస్ట్రీ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Bihar Assembly : నువ్వో పిల్ల బచ్చగాడివి అంటూ తేజస్వియాదవ్ పై నితీష్ ఆగ్రహం
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ జంట తరచూ తమ ప్రేమను, జీవితశైలిని అభిమానులతో పంచుకుంటుంటారు. తమ రోజువారీ జీవితంలో జరగుతున్న చిన్న విషయాలను కూడా వదిలిపెట్టకుండా రీల్స్ రూపంలో అభిమానులకి చేరవేస్తున్నారు. దీని వల్ల వీరికి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా యువతలో ఈ జంటను ఆదరించే వారు భారీగా ఉన్నారు.
వీరి ప్రేమ, బంధం, భవిష్యత్తుపై అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. న్యూయార్క్ వీధుల్లో చేసిన తాజా ఫొటోషూట్‌తో మరోసారి ఈ జంట సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ఈ ప్రేమ జంటను పలువురు సినీ, టీవీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.