Priyanka Chopra: ప్రియాంక చోప్రా కుమార్తె ఫోటోలు వైరల్
ప్రియాంక చోప్రా విదేశి కుర్రాడు నిక్ జోనస్ ని ప్రేమ వివాహం చేసుకుని అక్కడే స్థిరపడింది. ఇటీవల ఈ జంట సరోగసి పద్దతి ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
- By Praveen Aluthuru Published Date - 10:54 AM, Sun - 11 June 23

Priyanka Chopra: ప్రియాంక చోప్రా (Priyanka Chopra)విదేశి కుర్రాడు నిక్ జోనస్ ని ప్రేమ వివాహం చేసుకుని అక్కడే స్థిరపడింది. ఇటీవల ఈ జంట సరోగసి పద్దతి ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. పీసీ-నిక్ గారాల పట్టి పేరు మాల్తీ మేరీ చోప్రా జోనాస్. ప్రియాంక చోప్రా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కూతురు మాల్తీ మేరీ చోప్రా జోనాస్‌తో ఎక్కువ సమయం గడుపుతోంది. కూతురు చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది. తాజాగా ప్రియాంక చోప్రా మాల్తీ మేరీ చోప్రా జోనాస్ ఫోటోలను షేర్ చేసింది. ఇండియన్ కల్చర్ ఉట్టిపడేలా ఆ ఫోటోలు ఉన్నాయి.
తాజాగా ప్రియాంక షేర్ చేసిన ఫొటోలో మాల్తీ లేత ఊదా రంగు లెహంగా ధరించి కనిపించింది.షేర్ చేసిన చిత్రాలను చూస్తుంటే, ప్రియాంక తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రియాంక తన కూతురు మాల్తీ మేరీని లెహంగా ధరించడం ఇది రెండోసారి. ప్రియాంక తన పోస్ట్‌తో “పూజ టైమ్, మిస్ యు నానా” అని రాసింది. ప్రియాంక చోప్రా తండ్రి క్యాన్సర్‌తో 2013 సంవత్సరంలో మరణించిన విషయం తెలిసిందే.
Read More: Jagan cinema : వెండితెరపై జగన్ తాండవం, `ఫైబర్ నెట్ ` లో కొత్త సినిమాల రిలీజ్