Priyanka Arul Mohan : పవన్ తర్వాత నానితో రొమాన్స్.. టాలీవుడ్ లో పాగా వేస్తున్న ముద్దుగుమ్మ..?
Priyanka Arul Mohan కోలీవుడ్ భామ ప్రియాంక అరుల్ మోహన్ చిన్నగా స్టార్ ఛాన్స్ లు అందుకుంటుంది. కోలీవుడ్ లో ఇప్పటికే వరుస అవకాశాలతో
- Author : Ramesh
Date : 19-10-2023 - 11:49 IST
Published By : Hashtagu Telugu Desk
Priyanka Arul Mohan కోలీవుడ్ భామ ప్రియాంక అరుల్ మోహన్ చిన్నగా స్టార్ ఛాన్స్ లు అందుకుంటుంది. కోలీవుడ్ లో ఇప్పటికే వరుస అవకాశాలతో అదరగొట్టేస్తున్న ప్రియాంక అరుల్ మోహన్ తెలుగులో కూడా టాప్ లేపే ఛాన్స్ లు అందుకుంటుంది. ఆల్రెడీ తెలుగులో నానితో గ్యాంగ్ లీడర్, శర్వానంద్ తో శ్రీకారం సినిమాలు చేసిన అమ్మడు ఆ తర్వాత ఛాన్స్ లకు కొంత గ్యాప్ తీసుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్ లో సుజిత్ డైరెక్షన్ లో చేస్తున్న OG సినిమాలో అమ్మడు ఛాన్స్ అందుకుంది.
పవన్ (Pawan Kalyan) ఓజీ తోనే అమ్మడికి సూపర్ క్రేజ్ రావడం పక్కా అని తెలుస్తుండగా పవన్ OG తర్వాత నాని సినిమాలో కూడా అమ్మడు లక్కీ ఛాన్స్ అందుకుంది. పవన్ OG రిలీజ్ తర్వాత ప్రియాంక తెలుగులో కూడా బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. నాని వివేక్ ఆత్రేయ కాంబోలో రాబోతున్న సినిమాలో ప్రియాంక (Priyanka)ని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
అందం అభినయం రెండు ఉన్న ప్రియాంక అరుల్ మోహన్ తెలుగులో పవన్, నాని (Nani) సినిమాలతో ఇక్కడ పాగా వేయాలని చూస్తుంది. ఎలాగు టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత ఉంటుంది కాబట్టి అమ్మడికి ఇది లక్కీ టైం అని చెప్పొచ్చు. OG టీజర్ తోనే సెన్సేషన్ అనిపించగా సినిమా బ్లాక్ బస్టర్ కొడితే మాత్రం ప్రియాంక రేంజ్ మారినట్టే అని చెప్పొచ్చు.
ఓ పక్క తమిళంలో కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని కాదనకుండా చేస్తుంది ప్రియాంక. ఇప్పుడు అమ్మడు తెలుగులో కూడా బిజీ అవ్వాలని చూస్తుంది. మొత్తానికి ప్రియాంకా కెరీర్ విషయంలో గోల్డెన్ టైం నడుస్తుందని చెప్పొచ్చు.
Also Read : Pooja Hegde Monokini : పూజా మోనోకిని అ.. అ.. అదుర్స్.. వీడియో..!