NTR – Prabhas : సలార్ 2ని పక్కన పెట్టేసి.. ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేయబోతున్న ప్రశాంత్ నీల్..
సలార్ 2ని పక్కన పెట్టేసి ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేయబోతున్న ప్రశాంత్ నీల్. అక్టోబర్ లో ముహూర్తం..
- By News Desk Published Date - 07:52 PM, Wed - 1 May 24

NTR – Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ లోని మాస్ యాంగిల్ ని మళ్ళీ ఆడియన్స్ కి పరిచయం చేస్తూ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. రెండు భాగాలుగా రూపొందిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ గత ఏడాది డిసెంబర్ లో రిలీజయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది. దీంతో ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది..? ఎప్పుడు కంప్లీట్ చేసుకొని థియేటర్స్ లోకి వస్తుందని..? క్యూరియోసిటీతో చూస్తున్నారు.
అయితే ప్రశాంత్ నీల్ మాత్రం.. సలార్ 2ని పక్కన పెట్టేసి ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సిద్దమవుతున్నారట. ప్రస్తుతం సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉండాల్సిన ప్రశాంత్ నీల్.. NTR31 సినిమా వర్క్స్ లో పాల్గొంటున్నారట. ఎన్టీఆర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయట. అక్టోబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ ని మొదలు పెట్టేలా ప్రశాంత్ నీల్ పని చేస్తున్నారట. ఇక ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్‌ని.. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న ఇవ్వనున్నారట.
ఇక ఈ సినిమా కూడా రెండు పార్టులుగా రాబోతుందట. అయితే ప్రశాంత్ నీల్ గత రెండు చిత్రాలకు, ఈ సినిమాకు చాలా తేడా ఉంటుందట. ప్రశాంత్ నీల్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. భారీ బడ్జెట్ తో దాదాపు 15 పైగా దేశాల్లో ఈ సినిమాని చిత్రీకరించనున్నారని టాక్ వినిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తన డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పడంతో.. ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి.
మరి ప్రశాంత్ నీల్ ఆ అంచనాలను అందుకుంటారో లేదో చూడాలి. ఇది ఇలా ఉంటే, ప్రశాంత్ నీల్ సలార్ 2ని పక్కన పెట్టేయడంతో ప్రభాస్ అభిమానుల్లో ఆందోళన మొదలయింది. ప్రభాస్ ప్రస్తుతం లైనప్ ని చూస్తుంటే.. అసలు సలార్ 2ని తీసుకు వస్తారా లేదా అనే సందేహం మొదలవుతుంది. మరి దీని గురించి ప్రశాంత్ నీల్ ఏం చెబుతారో చూడాలి.