Pranitha: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి ప్రణిత!
టాలీవుడ్ నటి ప్రణిత సుభాష్ ఆడబిడ్డ కు జన్మనిచ్చింది.
- Author : Balu J
Date : 11-06-2022 - 11:46 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ నటి ప్రణీత సుభాష్ ఆడబిడ్డ కు జన్మనిచ్చింది. తన అభిమానులు, నెటిజన్లందరితో సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని షేర్ చేశారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఒక స్వీట్ నోట్‌ను కూడా రాసింది. “గత కొన్ని రోజులు అవాస్తవికంగా ఉన్నాయి. తల్లిని కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది మానసికంగా కష్టతరమైన సమయం. డాక్టర్ సునీల్ ఈశ్వర్, ఆయన బృందానికి స్పెషల్ థ్యాంక్స్. నా ప్రసవం సాఫీగా జరిగేలా చేశారు. అలాగే డాక్టర్ సుబ్బు, మత్తుమందు నిపుణుడు, ఆయన బృందానికి కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను’’ అంటూ ఎమోషన్ అయ్యింది. తన గారాలపట్టితో కలిసి ఫొటోకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ప్రణీత ఫొటో వైరల్ గా మారింది.