Return of The Dragon : సూపర్ హిట్ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
- By News Desk Published Date - 11:10 AM, Tue - 18 March 25

Return of The Dragon : లవ్ టుడే సినిమాతో తమిళ్, తెలుగులో ఫేమ్ తెచ్చుకున్న హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇటీవల రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు, తమిళ్ లో ఒకేసారి థియేటర్స్ లో ఫిబ్రవరి 21న రిలీజయి భారీ హిట్ అయింది. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
AGS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయదు లోహర్ హీరోయిన్స్ గా నటించగా KS రవికుమార్, మిస్కిన్, గౌతమ్ మీనన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా తర్వాత కయదు లోహర్ బాగా పాపులర్ అయి యూత్ కి కొత్త కృష్ గా నిలిచింది. థియేటర్స్ లో ప్రేక్షకులను మెప్పించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా మార్చ్ 21 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. థియేటర్స్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి. ఇక ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం విగ్నేష్ శివన్ దర్శకత్వంలో LIK (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.
Also Read : Bahubali : పదేళ్ల వేడుక.. బాహుబలి రీ రిలీజ్.. ఎప్పుడంటే..