HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas The Reason Why Rajasaab Flopped

రాజాసాబ్ ప్లాప్ కావడానికి కారణం ప్రభాసేనా ? ఆయన వేలు పెట్టడం వల్లే ఇలా జరిగిందా ?

టాలీవుడ్‌లో ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘అనగనగా ఒక రాజు’ వంటి చిత్రాలు ఘనవిజయాలు సాధించి పరిశ్రమకు మంచి ఊపునిచ్చినప్పటికీ, అందరికంటే ముందుగా వచ్చిన ‘రాజాసాబ్’ నిరాశ పరచడం అభిమానులను కలచివేసింది

  • Author : Sudheer Date : 23-01-2026 - 12:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Raajasaab Working
Raajasaab Working

ఈ ఏడాది సంక్రాంతి రేసులో భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ‘రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. టాలీవుడ్‌లో ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘అనగనగా ఒక రాజు’ వంటి చిత్రాలు ఘనవిజయాలు సాధించి పరిశ్రమకు మంచి ఊపునిచ్చినప్పటికీ, అందరికంటే ముందుగా వచ్చిన ‘రాజాసాబ్’ నిరాశ పరచడం అభిమానులను కలచివేసింది. ఈ సినిమా గనుక విజయం సాధించి ఉంటే 2026 సంవత్సరానికి టాలీవుడ్ స్థాయి మరో మెట్టు పైకి ఎదిగి ఉండేదని, కానీ ఒక మంచి అవకాశం జారిపోయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Raajasaabh Ticket

Raajasaabh Ticket

సినిమా ఫలితం తేడా కొట్టడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు దర్శకుడు మారుతిని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. కథాకథనాల్లో లోపాలు ఉన్నాయని, ప్రభాస్ లాంటి భారీ స్టార్‌ను సరిగా వాడుకోలేదని మారుతిపై, ప్రొడక్షన్‌లో చురుగ్గా ఉన్న ఎస్‌కేఎన్ (SKN)పై ట్వీట్ల రూపంలో దాడి జరుగుతోంది. అయితే, ఒక సినిమా పరాజయానికి కేవలం దర్శకుడినే బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభాస్ వంటి అగ్ర కథానాయకుడు దగ్గరుండి చేయించుకున్న ‘వంటకం’ లాంటి ఈ సినిమా వైఫల్యంలో అందరి బాధ్యత ఉందనేది వాస్తవం.

లోపల జరుగుతున్న చర్చల ప్రకారం, ‘రాజాసాబ్’ విషయంలో కీలక నిర్ణయాలన్నీ ప్రభాస్ ఆధ్వర్యంలోనే జరిగాయట. హారర్ కామెడీ కథను ఎంచుకోవడం నుండి, ముగ్గురు హీరోయిన్ల ఎంపిక, బాలీవుడ్ రీమిక్స్ సాంగ్ ఐడియా మరియు ఎడిటింగ్ టేబుల్ వద్ద ప్రభాస్ పాత గెటప్ ఫైట్ సీక్వెన్స్‌ల వరకు ఆయన ప్రమేయం ఉందని అంటున్నారు. సినిమా విజయం సాధిస్తే క్రెడిట్ మొత్తం అందరూ పంచుకున్నట్టే, పరాజయం పాలైనప్పుడు కేవలం దర్శకుడిని లేదా నిర్మాణ బృందాన్ని నిందించడం అమానుషం. ఒక సినిమా అనేది సమష్టి కృషి ఫలితం, కాబట్టి దాని వైఫల్యానికి కూడా టీమ్ అంతా బాధ్యత వహించడమే సరైన ధర్మం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • maruthi
  • prabhas
  • raajasaab
  • Raajasaab Collections
  • Raajasaab final talk
  • Raajasaab flop
  • Raajasaab Result
  • SKN

Related News

    Latest News

    • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

    • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

    • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

    • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

    • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd