Salaar Release Trailer: రక్తం ఏరులై పారాలి.. ఖాన్సార్ ఎరుపెక్కాలి.. బాక్సాఫీస్ పరుగెత్తాలి..!
Salaar Release Trailer రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సలార్ సినిమా మొదటి పార్ట్ సలార్ 1 సీజ్ ఫైర్ మరో నాలుగు రోజుల్లో
- By Ramesh Published Date - 04:50 PM, Mon - 18 December 23

Salaar Release Trailer రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సలార్ సినిమా మొదటి పార్ట్ సలార్ 1 సీజ్ ఫైర్ మరో నాలుగు రోజుల్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై ఇప్పటికే వారం ముందు రిలీజైన ట్రైలర్ అంచనాలు పెంచగా లేటెస్ట్ గా రిలీజ్ ట్రైలర్ అంటూ మరో ట్రైలర్ కట్ వదిలారు. ఈసారి కథను మరింత చెబుతూ ఈ ట్రైలర్ వదిలారు.
ఖాన్సార్ ఎరుపెక్కాలి.. రక్తం ఏరులై పారాలి లాంటి డైలాగులు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమా అంటే యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్స్ తో పాటుగా హృదయానికి టచ్ అయ్యే బావోధ్వేగాలు కూడా ఉంటాయి. సలార్ రిలీజ్ ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక సినిమా రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ పై విజృంభించడం ఒక్కటే ఉంది.
సినిమాపై ఇప్పటికే తారాస్థాయి అంచనాలు ఉండగా ఈ రిలీజ్ ట్రైలర్ తో అది మరో లెవెల్ కి చేరుకున్నాయి. సలార్ 1 సీజ్ ఫైర్ మాస్ క్లాస్ అనే తేడా లేకుండ ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు అన్ని వర్గాల ఫ్యాన్స్ కి నచ్చేలా ఉంది. రిలీజ్ ట్రైలర్ శృతి హాసన్ ని కూడా చూపించారు. కె.జి.ఎఫ్ మేకర్స్ ఈ సినిమాను కూడా చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కించారు. పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న సలార్ ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందో చూడాలి.
Also Read : Bigg Boss7 : మహేష్ రానన్నాడా.. బిగ్ బాస్ షోపై సెలబ్రిటీల అనాసక్తి ఎందుకు..?
We’re now on WhatsApp : Click to Join