Salaar 2: సలార్ 2 షూటింగ్ మొదలయ్యేది అప్పుడే.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్?
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన హీరో
- By Nakshatra Published Date - 11:00 AM, Sun - 4 February 24
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన హీరో ప్రభాస్ ఈ సినిమాతో సూపర్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. కల్కి, సలార్ 2తో పాటుగా రాజాసాబ్ కి కూడా వరుసగా డేట్లు ఇస్తున్నాడు ప్రభాస్. వీటిలో కల్కి తన తొలి ప్రాధాన్యత. ఆ తరువాత సలార్ 2, రాజా సాబ్. ఈ సినిమాల విడుదల మధ్య కూడా గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్.
ఆ సంగతి పక్కన పెడితే సలార్ పార్ట్ వన్ విడుదల అయిన తర్వాత ప్రభాస్ అభిమానుల నుంచి సలార్ 2 ఎప్పుడు అనే ప్రశ్ననే ఎక్కువగా వినిపిస్తోంది. పార్ట్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే ప్రభాస్ ప్రస్తుతం కల్కితో పాటు రాజా సాబ్తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత సందీప్ వంగా స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలు ఉన్నాయి. కల్కి షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. మే 9న వచ్చినా రాకపోయినా అప్పటికే షూటింగ్ అయితే అయిపోతుంది. పైగా దీని టీజర్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హాలీవుడ్ సినిమాల టీజర్స్‌ను ప్లే చేసే సూపర్ బౌల్ ఈవెంట్లో కల్కి టీజర్ విడుదల చేయాలని చూస్తున్నారు.
వరల్డ్ హైయెస్ట్ వ్యూవర్ షిప్ కలిగిన ఈవెంట్ ఇది. అక్కడ కల్కి టీజర్ విడుదలైతే.. ఇండియన్ సినిమా మరో మెట్టు పైకి ఎక్కినట్లే. ఆగస్ట్ లోపు రాజా సాబ్ కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రభాస్. ఇక నవంబర్ నుంచి సలార్ 2 మొదలు పెట్టనున్నారు. ప్రశాంత్ నీల్ కూడా సలార్ 2 కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్‌తో సినిమా ప్లాన్ చేసినా దేవర పోస్ట్ పోన్ అవుతుండటంతో నవంబర్ నుంచి సలార్ 2 మొదలు పెట్టాలని చూస్తున్నారు నీల్. 2025 దసరాకు సలార్ 2ను విడుదల చేయాలనేది ప్రశాంత్ నీల్ ప్లాన్. దసరాకు కూడా డేట్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
Related News
Tamannah Special Song in Manchu Vishnu Kannappa : కన్నప్పలో మిల్కీ బ్యూటీ కూడానా.. మంచు విష్ణు పెద్ద స్కెచ్చే వేశాడుగా..!
Tamannah Special Song in Manchu Vishnu Kannappa ఈ సినిమాలో కాజల్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తుండగా లేటెస్ట్ గా తమన్నాని కూడా సినిమాలో తీసుకుంటున్నారని