Prabhas : మలయాళ భామతో ప్రభాస్ రొమాన్స్..!
- By Ramesh Published Date - 10:37 AM, Thu - 17 October 24

రెబల్ స్టార్ ప్రభాస్ హను రాఘవపుడి (Hanu Raghavapudi) కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా లో ఆల్రెడీ ఇమాన్వి ఇస్మైల్ హీరోయిన్ గా లాక్ చేశారు. సినిమా పూజా ముహూర్తం రోజే ప్రభాస్, ఇమాన్వి జంట అలరించింది. ప్రభాస్ కి పర్ఫెక్ట్ పెయిర్ గా ఇమాన్వి తో ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ ప్రేమలో పడిపోయారు. తన సోషల్ మీడియాలో డ్యాన్స్ లతో అలరించే ఇమాన్వి ఈ సినిమాతో స్టార్ రేంజ్ కి వెళ్తుందని చెప్పొచ్చు.
ఇదిలాఉంటే ప్రభాస్ (Prabhas) హను మూవీలో ఇమాన్వితో పాటు మరో హీరోయిన్ కి ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇమాన్వి తో పాటు మరో హీరోయిన్ గా మలయాళ భామ నమిత ప్రమోద్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మలయాళ భామ నమిత మాతృ భాషలో కథ మార్క్ నటనతో ఆకట్టుకుంటుంది. అంతేకాదు తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.
కథలో రాజకుమారి..
నమితా ప్రమోద్ తెలుగులో కూడా చుట్టాలబ్బాయ్, కథలో రాజకుమారి సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు అందుకోలేని నమిత (Namitha Pramod) ఈసారి ఏకంగా రెబల్ స్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. తప్పకుండా నమిత కెరీర్ కు ఇదొక గొప్ప అవకాశమని చెప్పొచ్చు. నమిత ప్రమోద్ ఈ ఛాన్స్ తో తన పాపులారిటీ పెంచుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు.
రెండో ప్రపంచయుద్ధం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ గా ఫౌజి అని పెట్టే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మరి ఈ సినిమా లో ఇంకెన్ని సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నారన్నది చూడాలి.
Also Read : Baahubali 3 : బాహుబలి-3 రానుందా..? – నిర్మాత హింట్