Prabhas : రాయలసీమ యాక్షన్ కథ కాదని.. ‘చక్రం’ సినిమా తీసిన ప్రభాస్..
ప్రభాస్ తో సినిమా అనుకున్నప్పుడు కృష్ణవంశీ రెండు కథలు చెప్పారట. ఒక కథ 'చక్రం' అయితే, మరో కథ రాయలసీమ యాక్షన్ మూవీ.
- By News Desk Published Date - 07:00 PM, Thu - 16 November 23

టాలీవుడ్(Tollywood) హీరో ప్రభాస్(Prabhas) పాన్ ఇండియా స్థాయికి ఎదిగి.. ప్రస్తుతం భారీ స్థాయిలో యాక్షన్ ప్యాకెడ్ మూవీస్ చేస్తున్నారు. రెబల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్.. తన కెరీర్ లో ‘చక్రం'(Chakram) వంటి వైవిద్యమైన సినిమాలో కూడా నటించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో విషాదాంత కథతో తెరకెక్కిన ఈ సినిమా 2005లో రిలీజ్ అయ్యి పరాజయం పాలైంది. అయితే ఈ మూవీ వద్దని ప్రభాస్ కి స్వయంగా కృష్ణవంశీ(Krishna Vamsi)నే చెప్పారట. కానీ ప్రభాస్ పట్టుబట్టి ఈ సినిమాలో నటించారట.
ప్రభాస్ తో సినిమా అనుకున్నప్పుడు కృష్ణవంశీ రెండు కథలు చెప్పారట. ఒక కథ ‘చక్రం’ అయితే, మరో కథ రాయలసీమ యాక్షన్ మూవీ. రాయలసీమ అంటే మళ్ళీ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ అనుకుంటున్నారేమో. అలా మీరు అనుకున్నట్లు తీస్తే కృష్ణవంశీ క్రియేటివ్ డైరెక్టర్ ఎలా అవుతారు.
ఆ మూవీ కథ ఏంటంటే.. రాయలసీమ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం ఇప్పటికి చాలామంది వెతుకుతుంటారు. కొన్ని ఫ్యామిలీస్ అయితే ఆ నిధి వేటని తమ కుటుంబ భాద్యతగా భావిస్తాయి. అలాంటి ఓ ఫ్యామిలీలోని హీరో.. నిధి వేట మొదలు పెడతాడు. ఈ కథలో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు వాహనాలు, గుర్రాలతో కూడా ఛేజింగ్స్ తో ఉండి.. ఒక పీరియాడిక్ యాక్షన్ ఫిలింగా ఉంటుందని ప్రభాస్ కి కృష్ణవంశీ చెప్పారట.
అయితే ప్రభాస్ ఈ కథకి నో చెప్పి చక్రం సెలెక్ట్ చేసుకున్నారట. ప్రభాస్ ఎంపికని కృష్ణవంశీ కూడా తప్పుబట్టారు. నువ్వు వర్షం వంటి యాక్షన్ హిట్టు అందుకున్నావు. నిన్ను చక్రం వంటి సినిమాలో ఆడియన్స్ అంగీకరించడం కష్టం అని కృష్ణవంశీ చెప్పారట.
దానికి ప్రభాస్ బదులిస్తూ.. “సార్ నా దగ్గరకి అన్ని మాస్ యాక్షన్ కథలే వస్తున్నాయి. కానీ నాకు నటనా ప్రాధాన్యం ఉన్న సినిమాలు కావాలి. అందుకే నేను మీ దగ్గరకి వచ్చాను. కాబట్టి మీరు ఏమి అనుకోకండి. మనం చక్రం కథతోనే సినిమా చేద్దాం” అని చెప్పారట. అలా చక్రం సినిమా తెరకెక్కింది. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కృష్ణవంశీ తెలియజేశారు.
Also Read : Naga Chaitanya : నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ ‘దూత’ రిలీజ్ ఎప్పుడో తెలుసా? ఏ ఓటీటీలో?
Related News

Salaar T Shirt : మార్కెట్లోకి ‘సలార్’ షర్ట్స్..ధర చాల తక్కువే
హోంబలే వెర్సెస్ వెబ్ సైట్ లో టీషర్ట్, హూడీ, హార్మ్ స్లీవ్స్ ను ఫ్యాన్స్ కోసం సిద్ధం చేసారు