Radhe Shyam First Review : రాధేశ్యామ్ ఫస్ట్ రివ్యూ…ప్రభాస్, పూజా కెమిస్ట్రీ సూపర్..!!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ మార్చి 11న రిలీజ్ కు రెడీగా ఉంది.
- By Hashtag U Published Date - 02:55 PM, Mon - 7 March 22
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ మార్చి 11న రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ మూవీ ప్రమెషన్స్ లో బిజిబిజీగా ఉంది చిత్ర యూనిట్. ఇప్పటికే టీం మొత్తం చెన్నై, ముంబైలో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్‌లోనూ ఓ ఈవెంట్ జరగనుంది. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ మూవీ లేటెస్ట్ సెన్సార్ కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేసుకుంది.ఈ సందర్బంగా ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు రాధేశ్యామ్ మూవీ ఎలా ఉంటుందో ముందే చెప్పుకొచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ లో వరుసగా ట్వీట్లు పెడుతున్నారు. రాధేశ్యామ్ మూవీ చూశానని…విజువల్ ఎఫెక్టస్ అద్భుతంగా ఉన్నాయన్నారు. ప్రభాస్ , పూజాహెగ్డేల కెమిస్ట్రీ ఈ మూవీలో బాగుందని..క్లైమాక్స్ ఎవరూ ఉహించని విధంగా ఉంటుందన్నారు.
HYPE chusthunte "Non Radheshyam" Records ani
Konni Areas lo Padela Undhi ga..👌👌👌Class ledhu.. Mass ledhu
At present.. His Name is enough.. #Prabhas..💞#RadheShyam#RadheShyamOnMarch11th https://t.co/HWy5mgP7pf pic.twitter.com/CqBlfji5R3— Venom (@UrstrulyShiva_9) March 7, 2022
ఒకేమాటలో చెప్పాలంటే…రాధేశ్యామ్ క్లాసిక్ అండ్ స్టైలిష్, థ్రిల్లింగ్ మిస్టరీ అండ్ రొమాంటిక్ మూవీ అన్నారు. రాధేశ్యామ్ ఓ ఎపిక్ అని…ప్రభాస్ ఎంతో అద్భుతంగా నటించారన్నారు. ప్రభాస్ డ్రెస్సింగ్ స్టైల్ బాగుందున్నారు. ఇండియాలో ప్రభాస్ క్లాస్, స్టైల్ ను బీట్ చేసేవాళ్లే లేరంటూ తెగ పొగిడేశారు. ఇక గతంలోనూ ఉమైర్ సంధు పలు మూవీస్ కు ఇలానే రిలీజ్ కు ముందే రివ్యూ ఇచ్చేశారు. అయితే అందులో కొన్ని మూవీస్ హిట్ అవ్వగా…కొన్ని అట్టర్ ప్లాప్ అయ్యాయి.రాధేశ్యామ్ మూవీపై ఉమైర్ చేసిన ట్వీట్ అంచనాలను భారీగా పెంచేసింది. ఇప్పటికే మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లోనూ స్టార్ట్ అయ్యాయి. ఈ ఫిల్మ్ లో భాగ్యశ్రీ, మురళీశర్మ, జగపతిబాబు వంటి తారలు మెయిన్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. యూరప్ నేపథ్యంలో జరిగే పీరియాడికల్ ప్రేమకథగా ఈ మూవీని రూపొందిచారు. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరణ్ మ్యూజిక్ అందించగా…హిందీ సాంగ్స్ కు మిథున్, అనూమాలిక్, మనన భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
Related News
Pooja hegde : గుంటూరు కారం అడ్వాన్స్ టిల్లుకి ఉపయోగపడుతుందా..?
Pooja hegde డీజే టిల్లుతో సక్సెస్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఆ హిట్ మేనియాని కొనసాగిస్తూ ఆ సినిమా సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ తో కూడా బ్లాక్ బస్టర్ హిట్