Prabhas Kalki 2898AD Teaser : హాలీవుడ్ ఈవెంట్ లో కల్కి టీజర్.. రెబల్ ఫ్యాన్స్ గూస్ బంప్స్ ఇచ్చే అప్డేట్..!
Prabhas Kalki 2898AD Teaser రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా ఈ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేశారు. హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రమోషన్ ని కామిక్ కాన్ లో
- Author : Ramesh
Date : 29-01-2024 - 12:21 IST
Published By : Hashtagu Telugu Desk
Prabhas Kalki 2898AD Teaser రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా ఈ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేశారు. హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రమోషన్ ని కామిక్ కాన్ లో మొదలు పెట్టారు. అక్కడ ప్రమోట్ చేసిన మొదటి ఇండియన్ సినిమాగా కల్కి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రభాస్, కమల్ హాసన్, రానా, నాగ్ అశ్విన్ ఇలా టీం అంత కూడా ఆ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక ఈ సినిమా టీజర్ కూడా ఆమధ్య రిలీజ్ కాగార్ ఇప్పుడు మరో టీజర్ కోసం బిగ్ ప్లాన్ చేస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join
హాలీవుడ్ సినిమాల టీజర్స్ ని మొదట ప్లే చేసే హయ్యెస్ట్ వీయర్ షిప్ ఉన్న సూపర్ బౌల్ ఈవెంట్ లో కల్కి టీజర్ ని ప్రెజెంట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతునాయట. కేవలం హాలీవుడ్ సినిమా టీజర్స్ మాత్రమే ఆ ఈవెంట్ లో ప్లే చేస్తారు. కానీ ఫస్ట్ టైం ఒక ఇండియన్ సినిమా అది కూడా ఒక తెలుగు సినిమా టీజర్ అక్కడ రాబోతుంది.
కల్కి సినిమాను నాగ్ అశ్విన్ ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారో అదే రేంజ్ లో ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మామూలుగా తన సినిమాల ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. కానీ కల్కి సినిమాకు నాగ్ అశ్విన్ చేస్తున్న ప్రమోషనల్ ప్లానింగ్ రాజమౌళిని మించేలా ఉందని చెప్పొచ్చు.
నెక్స్ట్ బిగ్ డైరెక్టర్స్ లిస్ట్ లో నాగ్ అశ్విన్ కచ్చితంగా ఉంటాడని కల్కి టీజర్ చూస్తేనే అర్ధమైంది. ఈ సినిమా టైం మిషన్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో వస్తుంది. సినిమాలో ప్రభాస్ తో పాటుగా కమల్ హాసన్ నటిస్తున్నారు. దీపిక పదుకొనె, దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్నారు.