Kalki 2898 AD : కల్కి సినిమాటిక్ యూనివర్స్.. ట్రైలర్‌తో అనౌన్స్ చేసేసిన దర్శకుడు..
కల్కి యానిమేషన్ సిరీస్ ట్రైలర్ తో సినిమాటిక్ యూనివర్స్ ని అనౌన్స్ చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్.
- By News Desk Published Date - 06:13 PM, Thu - 30 May 24

Kalki 2898 AD : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి 2898 ఏడి’. హిందూ మైథాలజీని, సైన్స్ ఫిక్షన్‌ని మిక్స్ చేసి.. తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కాగా ఇటీవల ప్రతి సినిమా పలు భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా కూడా పలు భాగాలుగా వస్తుందని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కానీ మూవీ టీం మాత్రం.. దీని పై ఎటువంటి కామెంట్స్ చేయలేదు.
తాజాగా దీని గురించి సైలెంట్ గా అప్డేట్ ని ఇచ్చేసారు. ఈ సినిమా రిలీజ్ కంటే ముందు.. మేకర్స్ ఒక యానిమేషన్ సిరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. భైరవ అండ్ బుజ్జి అనే సిరీస్ ట్రైలర్ ని మేకర్స్ నేడు రిలీజ్ చేసారు. ఇక ఈ ట్రైలర్ లో బుజ్జి అండ్ భైరవ యాక్షన్ తో పాటు.. కల్కి సినిమాటిక్ యూనివర్స్ అంటూ దర్శకుడు చూపించారు. ఇక ఇది గమనించిన ఆడియన్స్.. ఈ సినిమా పలు భాగాలుగా రాబోతుందని ఫిక్స్ అయ్యారు. కాగా ఈ యానిమేషన్ సిరీస్ ని రేపటి (మే 31) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ చేయనున్నారు.
ఈ యానిమేషన్ సిరీస్ తోనే సినిమా కథ మొదలవుతుందట. సినిమా చూడడానికంటే ముందు ఆడియన్స్.. కల్కి యూనివర్స్ అర్ధం చేసుకోవడం ఈ సిరీస్ ని రిలీజ్ చేస్తున్నారు. దీనిలో హీరో పాత్ర గురించి, అలాగే విలన్ సామ్రాజ్యం గురించి చూపించబోతున్నారని సమాచారం. భారీ స్టార్ కాస్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్నో సర్‌ప్రైజ్ లు ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతున్నాయని మేకర్స్ చెబుతున్నారు.