Pan India Star: దటీజ్ ప్రభాస్.. 3 చిత్రాలు, 100 కోట్ల ఓపెనింగ్స్!
బాహుబలి 2, సాహో, ఆదిపురుష్ సినిమాలతో రూ 100 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన ఏకైక హీరో ప్రభాస్ నిలిచాడు.
- By Balu J Published Date - 01:01 PM, Sat - 17 June 23
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇప్పుడొక పాన్ ఇండియా స్టార్. అతని నుంచి సినిమా వస్తుందంటే చాలు బాలీవుడ్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుందంటే ప్రభాస్ క్రేజ్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. హిట్స్ లేక వెలవెలబోతున్న బాలీవుడ్ కు పఠాన్ మూవీ తర్వాత ఆదిపురుష్ రూపంలో భారీ ఓపెనింగ్స్ ఇచ్చాడు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ పౌరాణిక యాక్షన్ ఎపిక్ ఆదిపురుష్ మూవీ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. మొదటిరోజు మిక్డ్స్ వినిపించినప్పటికీ, ఆదిపురుష్ మూవీకి మంచి బజ్ వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 150 కోట్ల రూపాయల గ్రాస్ ను సాధించిందని ట్రేడ్ వర్గాల అంచనా. అయితే ఈ సంవత్సరం బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ఆదిపురుష్ మూవీ నిలిచింది.
ఫస్ట్ రెండు, మూడు ఆటలు మిశ్రమ సమీక్షలతో ప్రారంభమైంది. కానీ ప్రభాస్ స్టార్ పవర్ ట్రిక్ పని చేసింది. ప్రభాస్ ఛరిష్మా అభిమానులను థియేటర్లకు రప్పించేలా చేసింది. దీంతో ఆదిపురుష్ (Adipurush) మూవీ చాలా ఏరియాల్లో అద్భుతమైన ఓపెనింగ్స్ సెట్ చేసింది. తద్వారా బాహుబలి 2, సాహో, ఆదిపురుష్ సినిమాలు రూ 100 కోట్ల ఓపెనింగ్స్ సాధించాయి. దీంతో పాన్ ఇండియా చరిత్రలో 100 కోట్లు సాధించిన ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచాడు. ఇక ఆదిపురుష్ కు మొదటిరోజు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్స్ లో మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.
బాహుబలి సక్సెస్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ (Pan India Star Prabhas) అయిపోయాడు. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ మరికొన్ని సినిమాలకు ఓకే చెప్పడంతో వాటి బడ్జెట్ కూడా భారీగానే ఉంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ (Salaar) మూవీ త్వరలోనే విడుదల కాబోతోంది. ప్రశాంత్ నీల్ వల్లే ఈ సినిమాపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఆ తర్వాత ప్రాజెక్టు కే మూవీలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రాజాడీలక్స్, స్పిరిట్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా షూటింగ్ జరుపుకోబోతున్నాయి.
Also Read: Hyderabad Youngster: సైకిల్ యాత్ర చేస్తూ, ఓటుహక్కుపై అవగాహన కల్పిస్తూ!
Related News
Prabhas: తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు ప్రభాస్ సాయం.. రూ.35 లక్షల విరాళం అందజేత
Prabhas: సాయం చేయడంలో ఎప్పుడు ముందుంటాడు పాన్ ఇండియా హీరో ప్రభాస్. సినిమా నటులకే కాకుండా తన స్నేహితులకు ఆపన్నహస్తం అందిస్తుంటాడు. అందుకే డార్లింగ్ అని పిలుస్తుంటారు. ఇక చిత్ర పరిశ్రమలో ఏ మంచి కార్యక్రమం జరిగినా అందులో తానూ భాగమవుతుంటారు రెబెల్ స్టార్ ప్రభాస్. అందరి కంటే ముందుగా స్పందిస్తూ తన వంతు ఆర్థిక సహాయం అందిస్తుంటారు ప్రభాస్. మే 4న హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో డైరెక్ట