Prabhas : హాస్పటల్ లో ప్రభాస్.. నిజమేనా ?
Prabhas : ఇటలీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఫిబ్రవరి 28న ప్రభాస్‌కు కాలుకు శస్త్రచికిత్స జరిగినట్టు తెలుస్తోంది.
- By Sudheer Published Date - 04:51 AM, Thu - 6 March 25

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు షాకింగ్ వార్త. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన ప్రభాస్.. వరుసగా సలార్, ఆదిపురుష్, కల్కి వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని , ప్రస్తుతం వరుస సినిమాలు లైన్లో పెట్టాడు. ఈ తరుణంలో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారని వార్తలు అందర్నీ షాక్ కు గురి చేస్తున్నాయి. సినిమా షూటింగ్ సమయంలోనా, లేక ప్రమాదవశాత్తుగా ఈ గాయం జరిగిందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ వార్త వెలుగులోకి రావడంతో డార్లింగ్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Kamal Haasan : మోడీ ప్రభుత్వం పై కమల్ హాసన్ కీలక ఆరోపణలు
ఇటలీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఫిబ్రవరి 28న ప్రభాస్‌కు కాలుకు శస్త్రచికిత్స జరిగినట్టు తెలుస్తోంది. బాహుబలి సినిమా సమయంలో ప్రభాస్ కాలుకు ఐరన్ రాడ్ వేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే భాగంలో మళ్లీ గాయమై, రాడ్ బ్రేక్ కావడంతో పరిస్థితి మరింత తీవ్రమైనట్లు సమాచారం. ఈ గాయం కారణంగా ప్రభాస్ ప్రస్తుతం కదల్లేని స్థితిలో ఉన్నారని, వైద్యులు అతనికి ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్ సూచించినట్టు తెలుస్తోంది.
ప్రభాస్ ఆరోగ్యంపై ఎలాంటి విషయాలు బయటకు రాకుండా పీఆర్ టీమ్ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గతంలో ప్రభాస్‌కు పెద్ద శస్త్రచికిత్స జరుగుతుందని చెప్పినట్టు ఇప్పుడు అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలో లేరని, అతని ఆరోగ్యంపై పూర్తి రహస్యంగా వ్యవహరిస్తున్నారని ఈ వార్తల ద్వారా తెలుస్తోంది. ఈ వార్త తెలిసిన వారంతా ప్రభాస్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్ 2’, ‘కల్కి 2’, ‘స్పిరిట్’, ‘రాజాసాబ్’ సినిమాల్లో నటిస్తున్నాడు.