Prabhas Has An EMERGENCY! ప్రభాస్ కు మోకాలు నొప్పి.. షూటింగ్స్ కు బ్రేక్!
పాన్ ఇండియాలో హీరో ప్రభాస్ పలు ప్రతిష్టాత్మక సినిమాలతో బిజీగా ఉన్న సమయం తెలిసిందే.
- By Balu J Published Date - 02:21 PM, Mon - 1 August 22
పాన్ ఇండియా హీరో ప్రభాస్ పలు ప్రతిష్టాత్మక సినిమాలతో బిజీగా ఉన్న సమయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడంటే ఎంతో బిజీగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాష్ కు ఊహించని షాక్ తగిలిచింది. మోకాలి నొప్పి కారణంగా షూటింగ్స్ కు ఎమర్జెన్సీ బ్రేక్ తీసుకున్నాడు. బాహుబలిలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ప్రభాస్ మోకాలికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు సూచించారు. అయితే ప్రభాస్ తన పెండింగ్ ప్రాజెక్ట్లు పూర్తయ్యే వరకు వాయిదా వేస్తూ వచ్చాడు.
ఆ తర్వాత, కోవిడ్ వ్యాప్తి చెందడంతో మరింత ఆలస్యం అయింది. రాధే శ్యామ్ విడుదలైన తర్వాత ఏప్రిల్ 2022లో శస్త్రచికిత్స జరిగింది. ప్రభాస్ కోలుకోవడానికి మూడు నెలల విరామం తీసుకున్నాడు. కానీ నొప్పి మళ్లీ మొదలైంది. “షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రభాస్ నొప్పితో బాధపడ్డాడు. US లో మళ్లీ మోకాలికి ట్రీట్ మెంట్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కనీసం ఒక నెలపాటు షూటింగ్స్ కు విరామం (బ్రేక్) తీసుకోవాలని వైద్యులు సూచించారు.” అని ఓ మీడియా కథనం స్పష్టం చేసింది. ప్రస్తుతం కేజీఎఫ్ దర్శకుడితో ‘సలార్’, అశ్విని దత్ తో ‘ప్రాజెక్టు కె’ లాంటి సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ చేయాల్సి ఉంది. ఆదిపురుష్ షూటింగ్ మాత్రం సగం మాత్రమే కంప్లీట్ అయ్యింది. ఇక వైద్యుల సలహాలు, సూచనలతోనే ప్రభాష్ షూటింగ్స్ ప్రారంభించాల్సి ఉంటుంది.
Tags
Related News
Disha Patani : నిషా ఎక్కిస్తున్న దిశా అందాలు.. గ్లామర్ షోలో ఆమె లెక్కే వేరబ్బా..!
Disha Patani బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దిశా పటాని సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా ఆడియన్స్ ని అలరిస్తుంది. అసలు అమ్మడు చేసే ఫోటో షూట్ చూసి ఎవరైనా డిస్టర్బ్ అవ్వాల్సిందే.