Prabhas Hanu Raghavapudi Movie : వరల్డ్ వార్ 2 నేపథ్యంతో ప్రభాస్ సినిమా.. సీతారామం డైరెక్టర్ క్రేజీ అటెంప్ట్..!
Prabhas Hanu Raghavapudi Movie పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాలు ప్రస్తుతం ఏ హీరో చేయట్లేదని చెప్పొచ్చు. లాస్ట్ డిసెంబర్ లో సలార్
- By Ramesh Published Date - 12:25 PM, Sat - 20 January 24

Prabhas Hanu Raghavapudi Movie పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాలు ప్రస్తుతం ఏ హీరో చేయట్లేదని చెప్పొచ్చు. లాస్ట్ డిసెంబర్ లో సలార్ గా వచ్చిన ప్రభాస్ ఆ సినిమాతో రెబల్ ఫ్యాన్స్ అందరికీ కిక్ ఇచ్చాడు. ఇక మరోపక్క ఈ సమ్మర్ కి కల్కి అంటూ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు ప్రభాస్. కల్కి సినిమా విషయంలో ఫ్యాన్స్ అంతా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. నాగ్ అశ్విన్ ఈ సినిమాను హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారని తెలుస్తుంది.
We’re now on WhatsApp : Click to Join
వైజయంతి మూవీస్ బ్యానర్ లో కల్కి (Kalki) సినిమా 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రాజా సాబ్ అంటూ మారుతి డైరెక్షన్ లో సినిమాతో వస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా విషయంలో కూడా ప్రభాస్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. మారుతి సినిమాతో కూడా పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు పభాస్.
కల్కి, రాజా సాబ్ (Raaja Saab ) తర్వాత సలార్2 ఉంటుంది. ఇప్పటికే సందీప్ వంగాతో స్పిరిట్ అనౌన్స్ మెంట్ రాగా మరోపక్క సీతారామం డైరెక్టర్ హను రాఘవపుడితో ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. హను తో సినిమా కూడా భారీ స్కేల్ లోనే ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం హను రాఘవపుడి వరల్డ్ వార్ 2 నేపథ్యంతో ఈ సినిమా కథ రాస్తున్నారట.
సినిమాకు మళ్లీ విశాల్ చంద్రశేఖర్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారు. ప్రభాస్ (Prabhas) హను ఈ కాంబో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందని అంటున్నారు. ఈ సినిమా ఇయర్ ఎండింగ్ లో సెట్స్ మీదకు వెళ్తుంది. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లేదా 2026 లో రిలీజ్ ఉంటుందని అంటున్నారు. సీతారామం తో హను టాలెంట్ ప్రూవ్ చేసుకోగా తప్పకుండా ఈ సినిమా కూడా ప్రభాస్ రేంజ్ కు తగినట్టుగా ఉంటుందని చెబుతున్నారు.
Also Read : Guntur Kaaram : గుంటూరు కారం అర్ధరాత్రి ప్రీమియర్లు వేసి తప్పు చేసాం – నిర్మాత నాగవంశీ
వరుస సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ అందించనున్నాయి. ఇన్నాళ్లు రెండేళ్లకు ఒక సినిమా అలా తీసిన ప్రభాస్ ఈ ఇయర్ రెండు సినిమాలు నెక్స్ట్ ఇయర్ ఒకటి ఇలా వరుస సినిమాలు రిలీజ్ లు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలతో ప్రభాస్ మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకుంటాడని చెప్పొచ్చు. హను రాఘవపుడి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న సినిమా మిగతా కాస్టింగ్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.