Prabhas : ప్రభాస్ హను మూవీ టైటిల్ అదేనా..!
హను రాఘవపుడి (Hanu Raghavapudi) ఈ సినిమాను కూడా పీరియాడికల్ కథతో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కల్కి సినిమా తర్వాత ప్రభాస్ మరో భారీ సినిమాతో
- By Ramesh Published Date - 04:53 PM, Mon - 15 July 24

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebalstar Prabhas) రీసెంట్ గా కల్కి 2898 ఏడి (Kalki 2898 AD) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. కల్కి 1 తో మరోసారి 1000 కోట్ల మార్క్ రీచ్ అయిన ప్రభాస్ కల్కి 2 తో దాన్ని మించే వసూళ్లను రాబట్టాలని చూస్తున్నాడు. ప్రభాస్ నెక్స్ట్ సినిమాల లైన్ లో స్పిరిట్ ఉంది. ఆ తర్వాత సీతారామం డైరెక్టర్ హను రాఘవపుడి డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించబోతున్నారు. హను రాఘవపుడి (Hanu Raghavapudi) ఈ సినిమాను కూడా పీరియాడికల్ కథతో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కల్కి సినిమా తర్వాత ప్రభాస్ మరో భారీ సినిమాతో ఇది చేస్తున్నారు. ప్రభాస్ హను కాంబో సినిమాకు టైటిల్ కూడా లాక్ చేసినట్టు తెలుస్తుంది.
ప్రభాస్ కోసం ఫౌజీ (Prabhas Fauji) అనే టైటిల్ ని లాక్ చేశాడట డైరెక్టర్. ఫౌజీ అంటే సైనికుడు అని అర్ధం. సో ఈ సినిమా ఇండిపెండన్స్ కు ముందు ఒక సోల్జర్ కథతో వస్తుంది. సీతారామం లాంటి సినిమా తర్వాత మరోసారి హను సోల్జర్ కథతో వస్తున్నాడు. ఈ సినిమా కథ ప్రభాస్ ఇమేజ్ కి తగినట్టుగా ఉంటుందని తెలుస్తుంది.
ఇక ప్రభాస్ సినిమాల లిస్ట్ చూస్తే సలార్ 2 (Salar 2), కల్కి 2 తో పాటుగా స్పిరిట్ హను రాఘవపుడి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ పై తన మార్క్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ప్రభాస్ హను మూవీ మాత్రం ఒక రేంజ్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది. సో ప్రభాస్ తో కొత్త సినిమా చేయాలని అనుకుంటే మాత్రం ఎలా లేదన్నా మరో మూడు నాలుగేళ్లు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం తను లైన్ లో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసే సరికి అంత టైం పడుతుంది.
Also Read : Ruhani Sharma : బీచ్ లో గ్లామర్ ట్రీట్.. హిట్ బ్యూటీ అందులో ఏమాత్రం తగ్గదంతే..!