Kalki 2898 AD : ఎగిరే కారు, బుల్లెట్ల జాకెట్.. కల్కి మూవీలో.. ఎన్నో వింతలు, విశేషాలు..
నేడు జరగబోయే కల్కి మూవీ ఈవెంట్ లో ఎగిరే కారు, బుల్లెట్లు పేల్చే జాకెట్ తో ఎన్నో వింతలు, విశేషాలతో ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతున్నారట.
- By News Desk Published Date - 07:07 AM, Wed - 22 May 24

Kalki 2898 AD : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి 2898 ఏడి’. భారీ స్టార్ కాస్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్నో సర్‌ప్రైజ్ లు ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతున్నాయి. కేవలం సినిమాతో కాదు, ప్రమోషనల్ ఈవెంట్స్ తో కూడా మేకర్స్.. ఆడియన్స్ ని థ్రిల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈక్రమంలోనే నేడు నిర్వహించబోతున్న బుజ్జి ఈవెంట్.. ఎన్నో వింతలు, అబ్బుర పరిచే విశేషాలతో ప్లాన్ చేస్తున్నారట.
ఈ సినిమాలో ప్రభాస్ తో ఒక స్పెషలైజెడ్ రోబో కారు కూడా కనిపించబోతుంది. ఇటీవలే ‘బుజ్జి’ అంటూ ఆ కారు ప్రీ లుక్ ని రిలీజ్ చేసారు. నేడు రామోజీ ఫిలిం సిటీలో జరగబోతున్న బుజ్జి ఈవెంట్ లో ఆ కారు ఫుల్ లుక్ ని రివీల్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి ప్రభాస్.. ఆ కారులోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నారట. ఆ కారు ఎగురుకుంటూ రానుందట. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ ఒక స్పెషలైజెడ్ బులెట్ జాకెట్ కూడా దరిస్తాడట.
ఆ జాకెట్ బుల్లెట్లు కూడా ఫైర్ చేస్తుందట. ఈ రెండు గాడ్జెట్స్ తో పాటు ఇంకా ఎన్ని వింతలు, విశేషాలను ఈ ఈవెంట్ లో ఆడియన్స్ కి చూపించి థ్రిల్ చేయబోతున్నారట. మరి ఆ వింతలు ఏంటో తెలియాలంటే.. ఈరోజు ఈవెనింగ్ వరకు వేచి చూడాల్సిందే. కాగా ఈ ఈవెంట్ ని యువ హేర్ తేజ సజ్జ హోస్ట్ చేయబోతున్నారని సమాచారం. గతంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమాని కూడా తేజనే హోస్ట్ చేసారు.
జూన్ 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే మరికొంతమంది స్టార్స్ కూడా గెస్ట్ రోల్స్ లో కనిపించబోతున్నారట.