Daniel Balaji : తెలుగు మూలాలున్న కోలీవుడ్ విలన్ కన్నుమూత
Daniel Balaji : ప్రముఖ కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ ఇక లేరు!!
- By Pasha Published Date - 07:30 AM, Sat - 30 March 24

Daniel Balaji : ప్రముఖ కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ ఇక లేరు!! ఈయన 48 ఏళ్ల చిన్న వయసులోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. డేనియల్ బాలాజీ ఛాతీ నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందారు. దీంతో తమిళ సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. డేనియల్ బాలాజీ చనిపోయారన్న విషయాన్ని ఎవరూ నమ్మలేక పోతున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇవాళ చెన్నైలోని పురసామివాకంలో డేనియల్ బాలాజీ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
డేనియల్ బాలాజీ తెలుగు మూలాలు
డేనియల్ బాలాజీ(Daniel Balaji) తెలుగు మూలాలున్న నటుడు. ఆయన తండ్రి తెలుగువాడు. తల్లి తమిళనాడు వాస్తవ్యురాలు. తెలుగులో సాంబ, చిరుత, టక్ జగదీష్ సహా పలు సినిమాల్లో డేనియల్ బాలాజీ నటించి అందరి మన్ననలు అందుకున్నారు. ఎన్టీఆర్ ‘సాంబ’ చిత్రంతో టాలీవుడ్‌లోని ఆయన ఎంట్రీ ఇచ్చారు. అనంతరం వెంకటేశ్‘ ఘర్షణ’ చిత్రంలో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఒకరిగా కనిపించి మెప్పించారు. రామ్‌చరణ్ ‘చిరుత’, నాగచైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాల్లోనూ నటించారు. నాని ‘టక్ జగదీష్’లోనూ మెయిన్ విలన్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. ఇదే ఆయన చివరి తెలుగు చిత్రం.
Also Read : Clean Air Coolers: మీ ఇంట్లో కూలర్ ఉందా..? అయితే శుభ్రం చేసుకోండిలా..!
- తమిళ మూవీ ఇండస్ట్రీలో దర్శకుడిగా మారాలనే లక్ష్యంతో డేనియల్ బాలాజీ సినిమాల్లోకి వచ్చారు. అయితే అనుకోకుండా నటుడిగా స్థిరపడ్డారు.
- చిట్టి అనే తమిళ సీరియల్‌తో కెరీర్ ప్రారంభించిన డేనియల్.. ఆ తర్వాత ఏప్రిల్ మదాతిల్, కాదల్ కొండెన్ వంటి మూవీస్‌లో నటించి పాపులర్ అయ్యారు.
- ఆయన తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలోనూ సినిమాలు చేశారు. ఎక్కువగా విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు.
- దర్శకుడు గౌతమ్ మీనన్‌తో డేనియల్ బాలాజీకి మంచి అనుబంధం ఉంది.
- కమల్‌హాసన్, గౌతమ్ మీనన్ కాంబోలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న ‘వెట్టైయాడు విలయాడు’ మూవీలో (తెలుగులో రాఘవన్) సైకో పాత్రలో తన విలనిజంతో డేనియల్ బాలాజీ భయపెట్టేశారు.
- పొల్లవదన్, అచ్చం యెన్‌బదు మదమైయదా, జ్ఞానకిరుక్కన్, వడాచెన్నై, బిగిల్‌తో పాటు పలు సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి.
- చివరగా గతేడాది అరియవాన్ అనే సినిమాలోనూ డేనియల్ కనిపించారు.