Poonam Kaur: పవన్ పై ‘పూనమ్’ కామెంట్స్.. మళ్లీ వైరల్!
పూనమ్ కౌర్ హీరోయిన్ గా కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా పాపులర్ అయిందని చెప్పాలి.
- By hashtagu Published Date - 01:28 PM, Sun - 13 March 22
పూనమ్ కౌర్ హీరోయిన్ గా కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా పాపులర్ అయిందని చెప్పాలి. ఎందుకంటే పూనమ్ తెలుగులో అనేక సినిమాలు చేసినా రాని గుర్తింపు, కాంట్రవర్సీల ద్వారానే వచ్చింది. ఇంకా చెప్పాలంటే… కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గానే వార్తల్లో నిలిచి, హైలెట్ అయ్యింది. ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో… పూనమ్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ.. కొద్ది నిమిషాలకే డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొంత మంది నాయకులను టార్గెట్ చేసి.. పోస్టులు పెట్టడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ సమయంలో పరోక్షంగా పూనమ్ కౌర్ ఒక పార్టీ అధినేతను ఉద్దేశించి కామెంట్లు చేసినట్లు రాజకీయవర్గాలలో జోరుగా ప్రచారం కూడా జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ పేరొందిన యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూనమ్ కౌర్… తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హీరోల గురించి తనదైన శైలిలో స్పందిస్తూ కామెంట్స్ చేశారు.
సదరు యూట్యూబ్ చానల్ యాంకర్ పూనమ్ కౌర్ కు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోల ఫోటోలు చూపిస్తూ వారిపై అభిప్రాయం తెలియజేయాలని కోరగా… సూపర్ స్టార్ మహేష్ బాబు ఫొటో రాగానే… మంచి మానవత్వం ఉన్న మనిషి అని తెలిపింది. అలానే మహేష్ బాబును అనేక మంది చిన్న పిల్లలను ఆదుకున్న రియల్ హీరో అని కొనియాడింది. ఆ తర్వాత అల్లు అర్జున్ ఫొటో రాగానే.. తగ్గేదేలే అనే డైలాగ్ చెప్పింది. ఆ తర్వాత రామ్ చరణ్ ఫొటో చూసి… అతడు జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పూనమ్ కౌర్ దీవించింది.
అనంతరం సీనియర్ హీరోల ఫొటోలు చూపించగా.. వారిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు పూనమ్. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫొటో రాగానే.. పూనమ్ కౌర్ సిగ్గుపడి కాంట్రవర్సీ అని కామెంట్ చేసింది. పవన్ కళ్యాణ్ గురించి ఇంతేనా… మీరు ఆయనతో యాక్డ్ చేయలేదా..? అని సదరు యూట్యూబ్ చానల్ యాంకర్ ప్రశ్నించగా… కొంతమంది నన్ను ఆయనతో నటించకుండా అడ్డు పడ్డారని పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఆయన గురించి నేను ఏమీ చెప్పలేను. పాజిటివ్ గా చెప్పినా ప్రాబ్లం… అలాగని నెగెటివ్ గా చెప్పినా ప్రాబ్లం… అందుకే నేనేమీ చెప్పను… అంటూ నాలుక కరుచుకుంటూ…. పవన్ కళ్యాణ్ ఫొటోను చూస్తే… నాకు సిగ్గొచ్చేస్తుందని తెగ సిగ్గు పడిపోయింది. చివర్లో ఒక్కమాట చెబుతా… దేవుడా… ఆయనతో అయినంత వరకు చాలు. అంటూ దండం పెట్టి తెగ నవ్వుకుంది పూనమ్ కౌర్. ప్రస్తుతం పూనం వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Related News
Nani: హీరో నాని, సుజిత్ మూవీ ఆగిపోయిందా!
Nani: నాన్ థియేట్రికల్ మార్కెట్ పతనం, థియేట్రికల్ రంగంలో హెచ్చుతగ్గులు కొన్ని ప్రాజెక్టులకు పెను ముప్పుగా మారుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో నాని ఓ సినిమాకు సైన్ చేయగా, అది భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన యాక్షన్ మూవీ. డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం బడ్జెట్ సమస్యల కారణంగా ప్రస్తుతానికి ఈ సినిమా ఆగిపోయింది. డ�