Pooja Hegde : బుట్ట బొమ్మ ట్రీట్.. సోషల్ మీడియా షేక్..!
బాలీవుడ్ మీద కూడా ఎక్కువ హోప్ పెట్టుకునే పరిస్థితి లేదు. ఐతే అడపాదడపా వచ్చిన ఛాన్స్ లను వాడుకుంటుంది. తెలుగులో రాధే శ్యాం తర్వాత మరో ఆఫర్ అందుకోలేదు పూజా హెగ్దే.
- By Ramesh Published Date - 11:57 AM, Sat - 20 July 24

బుట్ట బొమ్మ పూజా హెగ్దే (Pooja Hegde) సినిమాలతో కన్నా సోషల్ మీడియాలోనే ఈమధ్య తన ఫ్యాన్స్ ని ఎక్కువగా అలరిస్తుంది. అమ్మడు షేర్ చేస్తున్న ప్రతి ఫోటోకి ఫాలోవర్స్ పిచ్చెక్కి పోతున్నారు. పూజా హెగ్దే ఫోటో కనబడితే చాలు అది సోషల్ మీడియా వైరల్ కావాల్సిందే అనేలా చేస్తున్నారు. లేటెస్ట్ గా అమ్మడి పొట్టి డ్రెస్ ఫోటో హంగామా చేస్తుంది. షార్ట్ డ్రెస్ లో థై షో చేస్తూ ఐ క్రీం తింటూ కుర్రాళ్ల హృదయాలను మలి పెట్టేస్తుంది పూజా హెగ్దే.
సౌత్ సినిమాల్లో తన జోరు తగ్గించిన అమ్మడు బాలీవుడ్ మీద కూడా ఎక్కువ హోప్ పెట్టుకునే పరిస్థితి లేదు. ఐతే అడపాదడపా వచ్చిన ఛాన్స్ లను వాడుకుంటుంది. తెలుగులో రాధే శ్యాం తర్వాత మరో ఆఫర్ అందుకోలేదు పూజా హెగ్దే. అమ్మడు చేయాల్సిన కొన్ని ప్రాజెక్ట్ లలో వేరే హీరోయిన్స్ వచ్చి చేరడంతో డీలా పడింది. మహేష్ (Mahesh Babu) గుంటూరు కారం సినిమాలో ముందు పూజా హెగ్దేనే హీరోయిన్ గా అనుకున్నారు కానీ మధ్యలో శ్రీలీల (Sri Leela) వచ్చి ఆమె ఆఫర్ లాగేసుకుంది.
ఆ సినిమా నుంచి ఎగ్జిట్ అవ్వడమే అమ్మడికి బ్యాడ్ లక్ మొదలైంది. నాగ చైతన్యతో సినిమా ఛాన్స్ వచ్చిందని అంటున్నా ఆ చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ అప్డే రాలేదు. ఐతే ప్రస్తుతం ఖాళీగా ఉన్న పూజా హెగ్దే అలా జాలీగా గడిపేస్తూ తన ఫోటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది.
చిట్టి పొట్టి డ్రెస్సులతో (Pooja Hegde Short Dress) ఫాలోవర్స్ కి మంచి గ్లామర్ ట్రీట్ అందిస్తున్న పూజా హెగ్దే. ఈ విధంగా అయినా ఆడియన్స్ ని తన బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. మరి అమ్మడు ఈ ప్రయత్నాలన్నీ ఆమెకు అవకాశాలు వచ్చేలా చేస్తాయా లేదా అన్నది చూడాలి.
Also Read : Megastar Viswambhara : విశ్వంభర టీజర్ ఎప్పుడు.. మెగా ఫ్యాన్స్ అదిరిపోయే అప్డేట్..!