Naga Chaitanya : ఆ హీరోయిన్ తో నాగ చైతన్య ఎంగేజ్మెంట్..?
అఫిషియల్ గా చెప్పకపోయినా చలా క్లోజ్ సోర్స్ నుంచి వచ్చిన సమాచారం కావడం వల్ల దాదాపు ఈరోజు ఈవెనింగ్ నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ కన్ ఫర్మ్ అని
- By Ramesh Published Date - 10:26 AM, Thu - 8 August 24

Naga Chaitanya అక్కినేని నాగ చైతన్య ఈరోజు సాయంత్రం ఒక హీరోయిన్ ను ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడా.. నాగ చైతన్య లైఫ్ లోకి మరో హీరోయిన్ రాబోతుందా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. అక్కినేని ఫ్యామిలీలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయని తెలుస్తుంది. నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాలతో ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. నాగ చైతన్య ఎక్కడ ఉంటే శోభిత (Shobhitha) అక్కడ కనిపిస్తూ కొన్నాళ్లుగా వీరి మధ్య ఏదో జరుగుతుందని రూమర్స్ వచ్చాయి.
ఐతే ఫైనల్ గా వాళ్లిద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారని లేటెస్ట్ న్యూస్. ఐతే అఫిషియల్ గా చెప్పకపోయినా చలా క్లోజ్ సోర్స్ నుంచి వచ్చిన సమాచారం కావడం వల్ల దాదాపు ఈరోజు ఈవెనింగ్ నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ కన్ ఫర్మ్ అని అంటున్నారు. అంతకుముందు సమంతని ప్రేమించి పెళ్లాడిన నాగ చైతన్య ఆమెతో 3 ఏళ్లు కలిసి ఉండి ఆ తర్వాత డైవర్స్ తీసుకున్నారు.
సమంత మొదటి సినిమా ఏ మాయ చేసావె సినిమాతోనే టాలీవుడ్ కి పరిచయం కాగా ఆ సినిమా నుంచి వారి మధ్య రిలేషన్ ఏర్పడింది. ఇక ఏడు ఎనిమిది ఏళ్ల దాకా సీక్రెట్ గా ప్రేమించుకున్న వీళ్లు పెళ్లితో షాక్ ఇచ్చారు. ఇక జీవితాంతం కలిసి ఉంటారని అనుకున్న ఈ జంట సడెన్ గా ఒకరోజు విడాకులు ప్రకటించి షాక్ ఇచ్చారు.
ఐతే ఆ తర్వాత చైతన్య తన ఫుల్ ఫోకస్ మొత్తం సినిమాల మీద పెట్టాడు. ఐతే శోభితతో పరిచయం వారి మధ్య మంచి రిలేషన్ గా మారిందని తెలుస్తుంది. అందుకే శోభితని తన లైఫ్ లోకి ఆహ్వానిస్తున్నాడు నాగ చైతన్య. చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరుగుతుందని తెలుస్తుంది. మరి అక్కినేని ఫ్యామిలీ గురించి ఇంత సెన్సేషనల్ న్యూస్ బయట వైరల్ అవుతుంటే కాదని ఎవరు చెప్పట్లేదంటే అది నిజమే అన్నట్టుగా నెటిజెన్లు చెప్పుకుంటున్నారు.
Also Read : Rashmika : 100 కోట్ల సినిమా రష్మిక ఎందుకు వదిలేసింది..?