Ustaad Bhagat Singh : ఉస్తాద్ పని అయిపోయింది ..!!
Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ల 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) చిత్రానికి పవన్ కళ్యాణ్ ప్యాకప్ చెప్పేశారు
- By Sudheer Published Date - 07:50 AM, Mon - 15 September 25
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రానికి పవన్ కళ్యాణ్ ప్యాకప్ చెప్పేశారు. సినిమాలోని తన భాగం షూటింగ్‌ను ఆయన పూర్తి చేశారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా చిత్ర బృందంతో కలిసి పవన్ కళ్యాణ్ దిగిన ఫోటోలు, వీడియోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.
మరోవైపు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన తదుపరి చిత్రం ‘OG’ కి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేశారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. “OGని మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలానే ముగించారు” అని పేర్కొంటూ పవన్ కళ్యాణ్ డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో పవన్ OG (OG) లోగో ఉన్న డ్రెస్ ధరించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

పవన్ కళ్యాణ్ డబ్బింగ్ పూర్తి చేసిన సందర్భంలో చిత్ర దర్శకుడు సుజిత్ మరియు సంగీత దర్శకుడు తమన్‌లతో కలిసి ఉన్న ఫోటోను కూడా మూవీ యూనిట్ పంచుకుంది. ఈ ఫోటోకు “మిలియన్ డాలర్ పిక్చర్” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రాన్ని సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
పవన్ కళ్యాణ్ ఒకేసారి రెండు సినిమాలకు సంబంధించిన పనులు పూర్తి చేయడం అభిమానులలో ఆనందాన్ని నింపింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ పూర్తి కావడంతో, ఆ చిత్రం త్వరలోనే విడుదల అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే ‘OG’ డబ్బింగ్ పూర్తి కావడంతో, ఈ చిత్రం విడుదల తేదీ అయిన సెప్టెంబర్ 25 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తాయని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
Pakistan: భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు అవమానం.. వీడియో వైరల్!