Two Young Fans Dead : పరిహారం ప్రకటించిన పవన్, చరణ్
Two Young Fans Dead : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హీరో రామ్ చరణ్ కూడా బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
- By Sudheer Published Date - 03:17 PM, Mon - 6 January 25

గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Game Changer Pre Release ) అనంతరం ఇద్దరు మెగా అభిమానులు ( 2 Fans Dies) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన సినీ, రాజకీయ రంగాల్లో దిగ్భ్రాంతి కలిగించింది. ఈ వార్త తెలిసిన వెంటనే నిర్మాత దిల్ రాజు (Dil Raju) బాధిత కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పది లక్షల ఆర్థిక సాయాన్ని (Donates Rs 5 lakh each to their families) ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, వారిని అన్ని విధాలుగా అండగా నిలుస్తామని తెలిపారు.
Trisha : సీఎం అవ్వాలని ఉందంటున్న స్టార్ హీరోయిన్..!
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హీరో రామ్ చరణ్ (Pawan & Charan) కూడా బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దిల్ రాజు తరహాలోనే వారు ఇరు కుటుంబాలకు మరో పది లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తమ అభిమానులు ఇలా దుర్మరణం పాలవడం అత్యంత బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ఈ ప్రమాదంపై పవన్ కళ్యాణ్ తన ప్రెస్ నోట్‌లో స్పందిస్తూ, ఈవెంట్‌లో పాల్గొన్నవారు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని పదే పదే చెప్పానని గుర్తు చేశారు. హీరో రామ్ చరణ్ కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని కోరారు. అభిమానుల భద్రత తమకెంత ముఖ్యమో వివరించారు. ప్రతి ఒక్క అభిమాని తమ ఇంటికి సురక్షితంగా చేరుకోవాలని కోరామని తెలిపారు. గేమ్ చేంజర్ ఈవెంట్‌లో వేలాది మంది అభిమానులు, జనసైనికులు పాల్గొన్న విషయం తెలిసిందే. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ జాగ్రత్తలు పాటించారు. కానీ తిరుగు ప్రయాణంలో అనుకోని ప్రమాదం అందర్నీ శోకసంద్రంలో పడేసింది.