Trisha : సీఎం అవ్వాలని ఉందంటున్న స్టార్ హీరోయిన్..!
Trisha ఏదైనా పార్టీలో చేరి సీఎం కావాలన్న తన కోరిక తీర్చుకుంటుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా త్రిష పాలిటిక్స్ ఎంట్రీ పై సోషల్ మీడియాలో హడావిడి
- By Ramesh Published Date - 02:40 PM, Mon - 6 January 25

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) తన పొలిటికల్ ఇంట్రెస్ట్ మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. రెండు దశాబ్దాలుగా సౌత్ సినీ ప్రియులను అలరిస్తూ వస్తున్న త్రిష తన నటనతో ఆకట్టుకుంటూ వచ్చింది. మధ్యలో కెరీర్ కాస్త డల్ గా నడించినా సర్రే మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చింది. ఐతే త్రిష ఈమధ్య ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. అంతేకాదు ఆమెకు పొలిటికల్ డ్రీం కూడా ఉందని లేటెస్ట్ న్యూస్.
రీసెంట్ గా త్రిష తనకు తమిళనాడు (Tamilanadu) సీఎం అవ్వాలని ఉందని చెప్పినట్టుగా మీడియా కథనాలు వస్తున్నాయి. నిజంగానే త్రిష అలా అన్నదా లేదా అన్నది తెలియదు కానీ ఈ వార్త మాత్రం సంచలనంగా మారింది. తమిళనాడులో జయలలిత కూడా ముందు సినిమాలు చేసి ఆ తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చారు. ఐతే త్రిష కూడా తన నెక్స్ట్ టార్గెట్ పాలిటిక్సేనా అన్న డౌట్ మొదలైంది.
ఆయనకు పోటీగా త్రిష..
ఇదిలాఉంటే ఈమధ్యనే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) కొత్త పార్టీ పెట్టాడు. మరి ఆయనకు పోటీగా త్రిష కూడా కొత్త పార్టీ పెడుతుందా లేదా ఏదైనా పార్టీలో చేరి సీఎం కావాలన్న తన కోరిక తీర్చుకుంటుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా త్రిష పాలిటిక్స్ ఎంట్రీ పై సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది.
తెలుగు తమిళంలో స్టార్ గా ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన త్రిష సడెన్ గా ఇలా రాజకీయ ప్రవేశం గురించి ప్రస్తావించడం ఆమె ఫ్యనన్స్ కి కూడా షాక్ ఇచ్చింది. ఐతే త్రిష నిజంగానే పాలిటిక్స్ లోకి వస్తుందా లేదా అన్నది తర్వాత తెలుస్తుంది.