Pawan Kalyan : చేనేత మరమగ్గం ఫై పవన్ కళ్యాణ్ చిత్రపటం..ఇది కదా అభిమానమంటే
పవన్ కళ్యాణ్ ఫై ఓ చేనేత కార్మికుడు , పవన్ అంటే ప్రాణం ఇచ్చే అభిమాని స్వయంగా చేనేత మరమగ్గం పై పవన్ కళ్యాణ్ చిత్రపటం వేసి ఆయనపై తనకున్న అభిమానాన్ని , ప్రేమను చాటుకున్నాడు
- Author : Sudheer
Date : 16-07-2024 - 4:59 IST
Published By : Hashtagu Telugu Desk
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..ఈ పేరు వింటే చాలు అభిమానుల రోమాలు నిక్కబొడవాల్సిందే..చాలామంది హీరోలకు అభిమానులు ఉంటె ఒక్క పవన్ కళ్యాణ్ కు మాత్రమే భక్తులు ఉన్నారు. చిన్న పిల్లాడి దగ్గరి నుండి పండుముసలావిడ వరకు పవన్ కళ్యాణ్ ను అభిమానిస్తుంటారు. హీరోలు నటించే సినిమాలు బట్టి వారి ఫై అభిమానం పెంచుకుంటే..పవన్ వక్తిత్వం నచ్చి అభిమానం పెంచుకుంటారు. చాలామంది హీరోలు, రాజకీయ నేతలు డబ్బు సంపాదించడం కోసమే సినిమాలు (Movies) , రాజకీయాలు (Politics ) చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ మంచి చేయాలనే ఉద్దేశ్యంతో సినిమాలు , రాజకీయాలు చేస్తుంటాడు. అందుకే పవన్ అంటే ప్రధాని మోడీ దగ్గరి నుండి..గుడిసెలో ఉండే అవ్వ వరకు ఇష్టపడుతుంటారు..అభిమానిస్తుంటారు. ఆ అభిమానమే ఈరోజు ఆయన్ను దేవుడిగా కొలిచేలా చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
పదేళ్లుగా ఎలాంటి అధికారం చేతిలో లేకపోయినా తాను కష్టపడినా సొమ్ముతో రైతుల ఆకలి తీర్చాడు..వారికీ భరోసా కల్పించారు. అంతే కాదు ఎంతోమంది పలు రకాలుగా మరణిస్తే వారికీ రూ.5 లక్షల చొప్పున సాయం చేసాడు. ఇలా ఒకటేంటి ఎన్నో చేసాడు..అందుకే ఈరోజు ఏ పార్టీకి దక్కని విజయాన్ని రాష్ట్ర ప్రజలు జనసేన పార్టీకి దక్కించి చరిత్రలో నిలిచేలా చేసారు. ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి ఈరోజు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగానే కాదు పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ఫై ఓ చేనేత కార్మికుడు , పవన్ అంటే ప్రాణం ఇచ్చే అభిమాని స్వయంగా చేనేత మరమగ్గం పై పవన్ కళ్యాణ్ చిత్రపటం వేసి ఆయనపై తనకున్న అభిమానాన్ని , ప్రేమను చాటుకున్నాడు. ఇతడొక్కడే కాదు ఇలాంటి వారు లక్షలాది మంది ఉన్నారు. ఎప్పటికప్పుడు తమ అభిమాన నటుడిపై తమకున్న అభిమానాన్ని ఏదొక రూపంలో తెలియజేస్తుంటారు. ప్రస్తుతం సిరిసిల్ల అభిమాని వేసిన చేనేత చిత్రపటం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
చేనేత మరమగ్గం పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటం వేసి ఆయనపై ప్రేమని చాటుకున్న సిరిసిల్ల నేతన్న #pawankalyan #JanasenaParty #AndhraPradesh #HashtagU@PawanKalyan pic.twitter.com/U17Ehl48mf
— Hashtag U (@HashtaguIn) July 16, 2024
Read Also : Pushpa 2: The రూల్ – స్పీడ్ తగ్గిన ‘పుష్ప’..కారణం అదేనా..?