Pawan Kalyan : ఫ్యాన్స్ కి శుభవార్త చెప్పిన పవన్.. అప్పటివరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటా..
తాజాగా పవన్ కళ్యాణ్ తమిళ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
- By News Desk Published Date - 10:45 AM, Tue - 25 March 25

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యాక సినిమాలకు డేట్స్ ఇవ్వడం కుదరట్లేదు. పవన్ సినిమాలు చేస్తా అంటే నిర్మాతలు, దర్శకులు రెడీగానే ఉన్నారు. ఫ్యాన్స్ కూడా పవన్ సినిమాలు చేయాలనే కోరుకుంటున్నారు. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, OG సినిమాలు పూర్తిచేసే పనిలో ఉన్నారు. వాటికి డేట్స్ ఇవ్వడానికే పవన్ చాలా కష్టపడాల్సి వస్తుంది.
ఇవి కాకుకండా ఉస్తాద్ భగత్ సింగ్, సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా కూడా పవన్ ఒప్పుకొని ఉన్నాడు. కానీ ఇవి ఉండకపోవచ్చు అని అంతా ఫిక్స్ అయ్యారు. OG సినిమానే పవన్ చివరి సినిమా అని అంతా అనుకున్నారు. ఫ్యాన్స్ కూడా తప్పదు అని ఫిక్స్ అయిపోయారు. పవన్ ఏపీ లో డిప్యూటీ సీఎంగ మంచి హోదాలో ఉన్నారు కాబట్టి ఫ్యాన్స్ సర్దుకుపోతున్నారు.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తమిళ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
పవన్ సినిమాల గురించి మాట్లాడుతూ.. నేను నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. నేను సంపద కూడబెట్టుకోలేదు. సినిమా నిర్మాణంలో కూడా నేను భాగం కావట్లేదు. నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. నాకు ఉన్న ఆదాయ మార్గం నటన ఒక్కటే. నాకు డబ్బులు అవసరం ఉన్నంతవరకు నేను నటిస్తూనే ఉంటాను. నేను సినిమాలు చేసినంతకాలం వాటికి న్యాయం చేయాలి. కాకపోతే నా పరిపాలనకు ఎలాంటి ఆటంకం కలగకుండా కుదిరినప్పుడు డేట్స్ ఇస్తూ నటిస్తాను అని అన్నారు.
దీంతో పవన్ డబ్బుల కోసం అయినా తర్వాత కూడా సినిమాలు చేస్తాడని క్లారిటీ వచ్చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ పవన్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడా అనేదే సమస్య. ఏపీ పాలనలో బిజీగా ఉన్న పవన్ సినిమాలకు డేట్స్ ఇస్తే వెంటవెంటనే సినిమాలు పూర్తి చేయడానికి రెడీగా ఉన్నారు నిర్మాతలు. చూడాలి మరి పవన్ హరిహర వీరమల్లు, OG సినిమాల తర్వాత ఇంకేం సినిమాలు చేస్తారో.
Also Read : Pawan Kalyan : తమిళ్ స్టార్ విజయ్ కు పవన్ రాజకీయ సలహా.. ఏమని ఇచ్చారంటే..