Trivikram : పవన్‌తో పాటు త్రివిక్రమ్ కూడా తిరుమలలోనే.. దర్శనానంతరం త్రివిక్రమ్‌తో కలిసి బయటకి వచ్చిన పవన్ కూతుళ్లు..
పవన్ కళ్యాణ్ ఇద్దరు కూతుళ్లతో కలిసి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
- By News Desk Published Date - 05:00 PM, Wed - 2 October 24

Trivikram : నేడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తిరుమల(Tirumala) దర్శనానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రాయశ్చిత్త దీక్ష విరమించడానికి పవన్ నేడు తిరుమలకు వెళ్లారు. నిన్న అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ అలిపిరి నుంచి కాలి నడకన తిరుమలకు వెళ్లారు. ఇవాళ ఉదయం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూతుళ్లతో కలిసి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజనోవా కూతురు పొలినా అంజనా మొదటిసారి బయట కనపడటంతో పవన్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉన్న ఫొటోలు వైరల్ గా మారాయి.
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు, కుమార్తెలు ఆద్య కొణిదెల, పొలీనా అంజని కొణిదెలతో కలసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు.#ధర్మో_రక్షతి_రక్షితః #DharmoRakshatiRakshitah#SanatanaDharmaRakshanaBoard pic.twitter.com/qmM1fIalfW
— JanaSena Party (@JanaSenaParty) October 2, 2024
దర్శనానంతరం పవన్ కళ్యాణ్ నిత్య అన్నదాన సత్రంకి వెళ్లిపోయారు. అయితే పవన్ కూతుళ్లు మాత్రం త్రివిక్రమ్ తో కలిసి బయటకు వచ్చారు. దీంతో పవన్ కూతుళ్లు ఆద్య, పొలినా అంజనా త్రివిక్రమ్ తో కలిసి ఆలయం బయటకు వస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. ఇక పవన్ తో పాటు ఆయన క్లోజ్ ఫ్రెండ్, ఆర్ట్ డైరెక్టర్, శిల్పి ఆనంద్ సాయి కూడా తిరుమల దర్శనానికి వచ్చారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న #PawanKalyan కుమార్తెలు #Aadya, #PolenaAnjana…వారి వెంటే పవన్ సన్నిహితులు దర్శకుడు #Trivikram, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి. pic.twitter.com/uJ9Y1wQ0Gg
— Gulte (@GulteOfficial) October 2, 2024
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా తిరుమల వచ్చారు. పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో షేర్ చేసి డిప్యూటీ మినిస్టర్ గారితో కలిసి తిరుమల వెళ్ళాను అంటూ సంతోషంతో పోస్ట్ చేసాడు. పవన్ కళ్యాణ్ ఇలా తన కూతుళ్లతో పాటు తన క్లోజ్ ఫ్రెండ్స్ త్రివిక్రమ్, ఆనంద్ సాయి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వీరందరితో తిరుమలకు వెళ్లడం చర్చగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా పవన్ తిరుమల వెళ్లిన ఫొటోలు, వీడియోలే వైరల్ అవుతున్నాయి.
With Our Respected Deputy Chief Minister
The Way I call Him The #LEADER 🔥
Shri @PawanKalyan Gaaru at #Tirumala Today 💥@APDeputyCMO ✊❤️What a Mommmmmentttt !!! 🥹 HIGH 🔥 pic.twitter.com/HqtZZO41vP
— thaman S (@MusicThaman) October 2, 2024
Also Read : Pawan Interview: ఒకే ఒక్క ఇంటర్వ్యూతో ఆ వార్తలకు చెక్ పెట్టిన పవన్..?