Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ అదిరే అప్డేట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'హరిహర వీరమల్లు'. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.
- Author : hashtagu
Date : 07-04-2022 - 5:44 IST
Published By : Hashtagu Telugu Desk
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా ఇప్పటివరకు 60 శాతం పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి అదిరే అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ నెల 8 నుంచి ‘హరిహర వీరమల్లు’ రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్స్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్నారు.
పవన్ ప్రాక్టీస్ చేస్తున్న కొన్ని ఫొటోల్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ‘హరిహర వీరమల్లు’లో యాక్షన్ సన్నివేశాలకు అధిక ప్రాధాన్యం ఉంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గజదొంగ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న ‘హరిహర వీరమల్లు’కు ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా ‘భీమ్లా నాయక్’ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్… క్రిష్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులన్నీ తిరగ రాస్తాడని ఫిలింనగర్ లో చర్చించుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో లో ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీ చేయనున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా… ఆ వెంటనే సముద్రఖని డైరెక్షన్లో లో మరో సినిమా చేయనున్నారు పవన్ పవన్ కళ్యాణ్.