Pawan Kalyan- Sai Dharam Tej: సరికొత్త లుక్ లో పవర్ స్టార్.. బ్రో మోషన్ పోస్టర్ అదుర్స్!
పవన్, సాయిధరమ్ తేజ్ మూవీకి బ్రో అనే టైటిల్ ఫిక్స్ అయ్యింది. కొద్దిసేపటి క్రితమే మోషన్ పోస్టర్ విడుదలైంది.
- By Balu J Published Date - 05:08 PM, Thu - 18 May 23
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో బ్రో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మామ అల్లుడు కలిసి నటిస్తుంటడంతో ఈ మూవీపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. బ్రో అనే టైటిల్ కూడా క్యాచిగా ఉందంటూ పవన్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ మూవీ స్టోరీ లైన్ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం జులై 28 వ తారీఖున విడుదల కాబోతుంది.
నిన్న మొన్నటి వరకు #PKSDT అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడిన ఈ సినిమాకి సంబంధించిన అసలు టైటిల్ ‘బ్రో’ (Bro) అని కాసేపటి క్రితమే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేసారు. ముఖ్యంగా మోషన్ పోస్టర్ వీడియో కి థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ఫ్యాన్స్ పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు. శివునికి సంబంధించిన శ్లోకాలు బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతూ ‘బ్రో’ అంటూ సాగే ఈ వీడియో సినిమా పై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. సాయి ధరమ్ తేజ్ ఇటీవల విరుపాక్ష మూవీతో హిట్ కొట్టడం, పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మెగాభిమానులు.
Related News
Sekhar Kammula: నేను కాదు.. నా సినిమాలే మాట్లాడతాయి, కాపీ కొట్టే కథలు నేను చేయను!
Sekhar Kammula: నేషనల్అవార్డ్ విన్నర్ దర్శకుడు శేఖర్ కమ్ముల 2007 లో వచ్చిన సినిమా హ్యపీడేస్. ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలను కూడా పొందింది. అంతా కొత్తవారితో తీసిన ఆ సినిమాను మరలా ఏప్రిల్ 19 న రి రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల 2000లో డాలర్ డ్రీమ్స్ చిత్రంతో దర్శకుడు గా వెలుగులోకి వచ్చారు. ఆ తరవాత హ్యాపీ డేస్ నుంచి లవ్ స్టోరీ వరకు పలు సినిమాలు చేశారు. ఆయన సినిమా అంటే […]