Game Changer: చరణ్ గేమ్ ఛేంజర్ లో పవర్ స్టార్..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ గేమ్ ఛేంజర్. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 26-03-2024 - 3:51 IST
Published By : Hashtagu Telugu Desk
Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ గేమ్ ఛేంజర్. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ కు జంటగా కైరా అద్వానీ నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.జె. సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీలోని ‘జరగండి’ సాంగ్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేసారు. ఆ పోస్టర్ లో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు పేర్కొన్నారు. రేపు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకు సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు.
మరోవైపు ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించబోతున్నారట. ఇందులో ఓ నిజాయితీ గల రాజకీయ నాయకుడు పాత్ర ఉందట. ఆ పాత్రను ఎవరితో చేయించాలి అనేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదట. అసలు ఈ క్యారెక్టర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పూర్తిగా రాసుకున్నారట. ఎవరితో ఆ పాత్రను చేయిస్తే బాగుంటుందో ఆలోచిస్తున్నారట. అయితే మేకర్స్ వేరే ఎవరితోనే కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే ఆ పాత్రను చేయిస్తే బాగుంటుందని.. ఈ సినిమాకి మరింత క్రేజ్ వస్తుందని అనుకుంటున్నారట.
దీంతో గేమ్ ఛేంజర్ మూవీ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. దసరాకి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అయితే.. ప్రచారంలో ఉన్నట్టుగా ఇందులో పవర్ స్టార్ నటిస్తే.. గేమ్ ఛేంజర్ సంచలనమే. మరి.. ఏం జరగనుందో చూడాలి.