Pawan Kalyan : వీరమల్లు సెట్స్‌లోకి అడుగు పెట్టబోతున్న పవన్.. ఎప్పుడో తెలుసా..?
హరిహర వీరమల్లు సెట్స్‌లోకి అడుగు పెట్టబోతున్న పవన్. ఎన్నికల హడావుడి పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్..
- Author : News Desk
Date : 16-06-2024 - 4:55 IST
Published By : Hashtagu Telugu Desk
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో సూపర్ సక్సెస్ ని సాధించారు. ఇక ఇప్పుడు తాను మొదలుపెట్టి మధ్యలో వదిలేసిన సినిమాలు పై ఫోకస్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ చేతిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. రెండు భాగాలుగా వస్తున్న వీరమల్లు దాదాపు 50 శాతం పైనే షూటింగ్ ని పూర్తీ చేసుకుంది. ఇప్పుడు మిగిలిన భాగం కూడా పూర్తి చేసి పార్ట్ 1ని వీలైనంత త్వరగా ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈక్రమంలోనే పవన్ తన కాల్ షీట్స్ ని ముందుగా వీరమల్లుకే కేటాయిస్తున్నారు. ఆల్రెడీ చిత్ర నిర్మాతలకు పవన్ కబురు పంపించారు. అన్ని సిద్ధం చేసుకొని ఉండండి నేను షూటింగ్ కి వస్తానని. అయితే డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ ఈ నెల (జూన్) చివరిలో లేదా, జులై సెకండ్ వీక్ లో ప్రారభం కానుందట. ఇక పవన్ ఆల్రెడీ కబురు పంపించడంతో, చిత్ర యూనిట్.. ప్రొడక్షన్ వర్క్స్ ని శరవేగంగా ముందుకు తీసుకు వెళ్తున్నట్లు సమాచారం.
కాగా ఈ సినిమాని ముందుగా క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టారు. అయితే పవన్ పొలిటికల్ గ్యాప్ వల్ల క్రిష్ కి చాలా టైం వృధా అయ్యిపోయింది. దీంతో ఆయన ఈ సినిమాని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇక క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో దర్శకత్వ భాద్యతలను జ్యోతి కృష్ణ తీసుకున్నారు. నిర్మాత ఏ ఎం రత్నం కుమారుడైన జ్యోతి కృష్ణ.. దర్శకుడిగా పలు సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు క్రిష్ పర్యవేక్షణలో వీరమల్లుని డైరెక్ట్ చేయబోతున్నారు. కాగా ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు.