‘ OG ‘ షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవుతారో క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
ఒక మూడు నెలల తర్వాత OG షూటింగ్ లో జాయిన్ అవుతానని..ప్రస్తుతం రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని..లేకపోతే మీరే ప్రశ్నిస్తారని పవన్ చెప్పుకొచ్చాడు
- Author : Sudheer
Date : 03-07-2024 - 11:04 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..ఇక ఫై సినిమాలు చేస్తారా..? చేయడా..? ప్రస్తుతం సెట్స్ ఫై ఉన్న సినిమాల పరిస్థితి ఏంటి..? కోట్లు ఖర్చు చేసిన నిర్మాతలను పవన్ ఎలా ఆదుకుంటారు..? మళ్లీ పవన్ కళ్యాణ్ ను తెరపై చూడలేమా..? ఇలా అనేక ప్రశ్నలు పవన్ అభిమానులను వెంటాడుతున్నాయి. జనసేన పార్టీ ని విజయంలోకి తీసుకరావాలని, జగన్ ను గద్దె దించాలని పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డాడో తెలియంది కాదు. ఆ కష్టానికి ప్రతిఫలం ఏపీ ప్రజలు అందజేశారు. ఇంతవరకు నిల్చున్న అన్ని చోట్ల గెలిచినా పార్టీ లేదు. అలాంటిది ఆ ఘనత సాధించి జనసేన రికార్డు నమోదు చేసింది. 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి తన సత్తా ఏంటో ఢిల్లీ నేతలకు కూడా తెలిసేలా చేసాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ గెలుపుతో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పలు కీలక శాఖలకు మంత్రిగా బాధ్యత చేపట్టారు. బాధ్యత చేప్పట్టిన దగ్గరి నుండి పవన్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. అన్ని శాఖల అధికారులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో అడిగి తెలుసుకుంటూ తన ఆలోచనలను పంచుకుంటున్నారు. అలాగే ప్రజల సమస్యలు సైతం తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్నారు. ఇక మూడు రోజులుగా కాకినాడ లో పర్యటిస్తున్న పవన్…బుధువారం పిఠాపురంలో భారీ సభ నిర్వహించి తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా అభిమానులు OG మూవీ గురించి అడుగగా..సమాధానం తెలిపారు.
ఒక మూడు నెలల తర్వాత OG షూటింగ్ లో జాయిన్ అవుతానని..ప్రస్తుతం రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని..లేకపోతే మీరే ప్రశ్నిస్తారని పవన్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే నిర్మాతలకు కాస్త సమయం ఇవ్వండి..తప్పకుండ వచ్చి షూటింగ్ చేస్తానని తెలిపినట్లు పవన్ పేర్కొన్నారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మరోసారి స్పష్టం చేసారు.
Read Also : Nani Srikanth Odela : నాని దసరా కాంబో షాక్ అయ్యే బడ్జెట్..!