Pawan Kalyan: రుషికొండ బీచ్‌లో పవన్ కళ్యాణ్.. నేచర్ ను ఆస్వాదిస్తూ!
జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ కు, నేచర్ కు వీడదీయని అనుబంధం ఉంది.
- Author : Balu J
Date : 12-11-2022 - 5:54 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ కు, నేచర్ కు వీడదీయని అనుబంధం ఉంది. ఆయనకు ఏమాత్రం సమయం దొరికినా ప్రకృతి ఒడిలో వాలిపోతుంటారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడిపే పవన్ తన ఫామ్ హౌజ్ లోనూ రకరకాల పంటలు పండిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ అక్కడి రుషికొండ బీచ్‌లోని ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు. ప్రస్తుతం ఈ ఫొటో పవన్ అభిమాలను ఆకర్షిస్తోంది.
ప్రస్తుతం పవన్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ ‘హరిహర వీరమల్లు'(HariHara VeeraMallu) అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల కమిట్మెంట్స్ తో సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలుపెట్టాలనుకున్నారు. దానికి తగ్గట్లుగా వర్క్ షాప్స్ కూడా నిర్వహించారు. ఇందులో నటీనటులు, టెక్నీషియన్స్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు.