HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pawan Kalyan Congratulation To Dil Raju Panel

దిల్ రాజు ప్యానల్‌ కు అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నూతన కార్యవర్గానికి హృదయపూర్వక అభినందనలు

  • Author : Sudheer Date : 01-08-2023 - 8:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Congratulation To Dil Raju Panel
Pawan Congratulation To Dil Raju Panel

ఆదివారం తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికలు (TFCC Elections) జరుగగా..ఈ ఎన్నికల్లో నిర్మాత సి కళ్యాణ్ ప్యానల్‌ ఫై దిల్ రాజు ప్యానల్‌ విజయం (Dil Raju’s Panel Wins) సాధించింది. ఈ తరుణంలో దిల్ రాజు ప్యానల్‌ సభ్యులకు సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan )అభినందనలు తెలిపారు.

‘‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నూతన కార్యవర్గానికి హృదయపూర్వక అభినందనలు. అధ్యక్షులుగా ఎన్నికైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కోశాధికారి, సెక్టార్ కౌన్సిల్ చైర్మన్లు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు.. మండలి కార్యకలాపాలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తారని ఆకాంక్షిస్తున్నాను. ఒక సినిమా నిర్మితమవుతోందంటే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. రూ.కోట్ల సంపద సృష్టి జరుగుతుంది. పన్నులు చెల్లిస్తారు. తెలుగు సినిమా స్థాయి వాణిజ్యపరంగా రోజురోజుకీ విస్తృతమవుతోంది. కాబట్టి పరిశ్రమ తలెత్తుకొని నిలిచేలా ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గం పని చేస్తుందని ఆశిస్తున్నాను..’’ అంటూ పవన్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.

ఇక తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల విషయానికి వస్తే..ఫిలిం చాంబర్‌ (Film Chamber)లో మొత్తం 1600 మంది సభ్యులు ఉండగా.. 891 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రొడ్యూసర్‌ సెక్టార్‌లో 1600 ఓట్లకు 891 ఓట్లు పోల్‌ కాగా.. స్టూడీయో సెక్టార్‌లో 98 ఓట్లకు 68 పోల్‌ అయ్యాయి. ఇక డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌లో 597 ఓట్లకు 380 పోలయ్యాయి.

ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లో 12 మందిలో దిల్‌రాజు ప్యానల్‌ నుంచి ఏడుగురు ఎన్నికయ్యారు. స్టూడియో సెక్టార్ నుంచి గెలుపొందిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్‌ కాగా డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ఇరు ప్యానల్స్‌లో చెరో ఆరుగురు గెలిచారు. మొత్తం 14 రౌండ్లలో దిల్ రాజు ప్యానల్‌కు 563ఓట్లు, సి.కళ్యాణ్ ప్యానల్‌కు 497 ఓట్లు పోలయ్యాయి.

Read Also : Telangana High Court : అయోమయంలో 26 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dil raju
  • Dil raju panel
  • pawan congratulation
  • Pawan Kalyan
  • TFCC Elections

Related News

Janasena 13th Formation Day

Janasena Formation Day : ‘జనసేన’కు 13 ఏళ్లు.. సామాన్యుడి గొంతుక నుంచి డిప్యూటీ సీఎం వరకు.. ఒక చారిత్రక ప్రయాణం!

జనసేన ప్రయాణం పూల బాట కాదు. 2019 ఎన్నికల్లో ఎదురైన పరాజయం, రెండు చోట్లా పవన్ కళ్యాణ్ ఓడిపోవడం వంటి సంఘటనలు పార్టీ మనుగడపై ప్రశ్నలు రేకెత్తించాయి. అయితే, ఓటమిని చూసి

  • Ustad Bhagat Singh Ccensor

    Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

Latest News

  • తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్‌న్యూస్

  • Anasuya : అనసూయపై అసభ్యకర పోస్టులు చేసిన వ్యక్తి అరెస్ట్

  • ఆరు నెలల్లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు

  • Ram Charan Birthday Song : చ‌ర‌ణ్ బర్త్‌డే స్పెషల్.. ఆ పాట ఆపండి మహాప్రభో

  • Watermelon : పుచ్చకాయ కొనేటప్పుడు ఇవి తప్పక గమనించండి!

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd