Ustaad Bhagat Singh Teaser : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీజర్‌పై పవన్ కళ్యాణ్ కామెంట్స్
ఆ సీన్ హరీష్ శంకర్ రాసినప్పుడు.. ఇందుకు ఇదీ అని అడిగాను. లేదు సార్ అందరూ మిమ్మల్ని ఓడిపోయాడు ఓడిపోయాడు అని అంటున్నారు. గాజుకున్న లక్షణం ఏంటంటే.. పగిలేకొద్దీ పదునెక్కుద్ది అని అన్నాడు
- By Sudheer Published Date - 08:59 PM, Tue - 19 March 24

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు అసలైన పండగ తీసుకొచ్చారు హరీష్ శంకర్ (Harish Shankar). మంగళవారం సాయంత్రం ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ రిలీజ్ చేసి అభిమానుల్లో పూనకాలు పుట్టించారు. ముఖ్యంగా టీజర్ లో పవన్ కళ్యాణ్ చేత అసలైన సిసలైన డైలాగ్స్ చెప్పించి పొలిటికల్ లో కూడా చర్చ కు దారి తీసేలా చేసాడు హరీష్.
‘‘నీ రేంజ్ ఇది అంటూ.. విలన్ టీ గ్లాస్ చూపిస్తూ.. దాన్ని కిందపడేసి పగలగొడతాడు. అప్పుడే.. పవన్ కల్యాణ్ మాస్ ఎంట్రీ ఇస్తాడు. రౌడీలను చితక్కొడతాడు. ‘‘గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’’ అంటూ విలన్ పీక కోస్తాడు. ‘‘కచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాసంటే సైజు కాదు సైన్యం. కనిపించని సైన్యం’’ డైలాగ్, యాక్షన్ సీక్వెన్స్‌తో టీజర్ ఎండ్ అయ్యింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియా లో టాప్ వన్ గా ట్రెండ్ అవుతుంది. అభిమానులైతే ఈ టీజర్ చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదే కదా మీము కోరుకున్నదంటూ హరీష్ కు థాంక్స్ చెపుతూ కామెంట్స్ చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ డైలాగ్స్ ఫై పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘‘ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో గాజు గ్లాస్‌ని కిందపడేస్తాడు. గాజు కిందపడి ముక్కలైపోతుంది. ఆ సీన్ హరీష్ శంకర్ రాసినప్పుడు.. ఇందుకు ఇదీ అని అడిగాను. లేదు సార్ అందరూ మిమ్మల్ని ఓడిపోయాడు ఓడిపోయాడు అని అంటున్నారు. గాజుకున్న లక్షణం ఏంటంటే.. పగిలేకొద్దీ పదునెక్కుద్ది అని అన్నాడు. నా సినిమాల్లో ఇలాంటి డైలాగ్‌లు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. మా హరీష్ శంకర్ బాధపడలేక చెప్పాల్సి వచ్చింది అని క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం ఉన్న పొలిటికల్ వేడికి ఈ టీజర్ మరింత వేడి పెంచిందనే చెప్పాలి.
Read Also : Kakinada Janasena MP Candidate : కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్