Ott Movies: ఈ వారం ఓటీటీలో అలరించనున్న చిత్రాలు వెబ్ సిరీస్ లు ఇవే?
ప్రతి వారం ఓటీటీ లో,థియేటర్లలో పదుల సంఖ్యలో సినిమాలు వెబ్ సిరీస్లు విడుదల అవుతూనే ఉన్నాయి. వేసవికాలం
- By Anshu Published Date - 05:32 PM, Thu - 20 April 23

ప్రతి వారం ఓటీటీ లో,థియేటర్లలో పదుల సంఖ్యలో సినిమాలు వెబ్ సిరీస్లు విడుదల అవుతూనే ఉన్నాయి. వేసవికాలం కావడంతో కుటుంబ సభ్యులు ఎంచక్కా ఇంట్లో కూర్చొని ఓటీటీలో సినిమాలను వెబ్ సిరీస్లను చూస్తూ ఆదరిస్తున్నారు. ఈ వారం కూడా ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సినిమాలు వెబ్ సిరీస్ లో రెడీగా ఉన్నాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే.. రాజేంద్రప్రసాద్ మీనా ప్రధానాపాత్రలో నటించిన చిత్రం ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు. ఎస్వి కృష్ణారెడ్డి సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్,మృణాలిని ఇందులో జంటగా నటించిన విషయం తెలిసిందే.
ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం వర్జిన్ స్టోరీ. ఇందులో సౌమిక పాండియన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే విడుదల అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో ఏప్రిల్ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ రెండు సినిమాలతో పాటు ఈ వారం ఓటీటీలో ట్రైనింగ్ కానున్న సినిమాలు వెబ్ సిరీస్ లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒరు కోడై మర్డర్ మిస్టరీ అనే తమిళ్ మూవీ ఏప్రిల్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
డ్యాన్సింగ్ ఆన్ ది గ్రేవ్ అనే హిందీ డాక్యుమెంటరీ సిరీస్ ఏప్రిల్ 21నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. డెడ్ రింగర్స్ అనే ఇంగ్లీష్ సిరీస్, సీజన్-1 కూడా ఏప్రిల్ 21 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. చోటా భీమ్ సీజన్-17 నేడు అనగా ఏప్రిల్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. టూత్‌పరి హిందీ అనే వెబ్ సీరిస్ ఏప్రిల్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే డిప్లొమాట్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సత్య2 అనే తెలుగు వెబ్ సిరీస్ కూడా ఏప్రిల్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. రెడీ అనే తెలుగు సినీమా ఏప్రిల్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇండియన్ మ్యాచ్ మేకింగ్ వెబ్‌సిరీస్ ఏప్రిల్ 21 నుండి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఎ టూరిస్ట్స్ గైడ్ టు లవ్ ఇంగ్లీష్ అనే వెబ్ సిరీస్ కూడా ఏప్రిల్ 21 నుండి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. రఫ్ డైమండ్స్ బెల్జియం ఏప్రిల్ 21, వన్ మోర్ టైమ్ స్వీడిష్ ఏప్రిల్ 21, చోక్‌హోల్డ్ టర్కిష్ అనే వెబ్ సిరీస్ లు కూడా ఏప్రిల్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి. సోనీలివ్ లో గర్మీ అనే సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే డిస్నీ+హాట్‌స్టార్ కన్నా కానుమ్ కాళంగల్ తమిళ్ సీజన్-2 ఏప్రిల్ 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సుగా డాక్యుమెంటరీ స్పెషల్ కూడా ఏప్రిల్ 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది.