Naga Vamsi : నాగవంశీ వ్యాఖ్యలతో బాధపడుతున్న వేరే సినిమాల నిర్మాతలు.. ఆ సినిమాల గురించి అలా అనడంతో..
నాగవంశీ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
- By News Desk Published Date - 10:39 AM, Wed - 2 April 25

Naga Vamsi : టాలీవుడ్ లో నిర్మాత నాగవంశీ ఎప్పుడూ తన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇటీవల నాగవంశీ సితార నిర్మాణ సంస్థ నుంచి మ్యాడ్ స్క్వేర్ సినిమా రిలీజయింది. ఈ సినిమా పెద్ద హిట్ అయి ఇప్పటికే 60 కోట్ల కలెక్షన్స్ తెచ్చింది. ఈ సినిమాకు మీడియాలో కూడా అందరూ ఆల్మోస్ట్ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు.
అయితే నిన్న నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి.. కొంతమంది సినిమా బాగున్నా నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. సినిమా ఎందుకు హిట్ అయిందో అని అనాలసిస్ చేస్తున్నారు. నన్ను బ్యాన్ చేసుకోండి. మేము సినిమాలు తీయకపోతే మీకు వార్తలు లేవు. మా మీద పడి బతుకుతూ మమ్మల్ని నెగిటివ్ చేస్తున్నారు అని ఫైర్ అయ్యాడు. దీంతో నాగవంశీ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
అయితే ఇదే ప్రెస్ మీట్ లో.. కోర్ట్ సినిమా అప్పుడు ఇంకో సినిమా బాగోలేదు కాబట్టి కోర్ట్ సినిమా బాగుండటంతో ఆడింది. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ బాగుంది. ఇంకో సినిమా బాగోలేదు కాబట్టి మా దానికి ప్లస్ అయింది అని అన్నారు. దీంతో నాగవంశీ వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి. ఇతని సినిమాలు బాగున్నాయి అని చెప్పుకోవడం కోసం వేరే సినిమాలు బాగోలేవు అని చెప్పడం ఎందుకు అంటూ పలువురు మండిపడుతున్నారు.
కోర్ట్ సినిమా సమయంలో కిరణ్ సబ్బవరం దిల్ రుబా రిలీజయింది. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ సినిమా సమయంలో రాబిన్ హుడ్ రిలీజయింది. ఇది యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఆ సినిమా నిర్మాతలు మధ్యలో మా సినిమాల గురించి మాట్లాడటం ఎందుకు అని అంటున్నారట. ఆయన సినిమాలు గురించి మాట్లాడుకుంటే చాలు మా సినిమాలు ఫ్లాప్ అయ్యాయని చెప్పాలా, మా సినిమాలు బాగోలేవని అనాలా అంటూ ఫైర్ అవుతున్నారట.
అసలే రాబిన్ హుడ్ ఇంకా థియేటర్స్ లో ఉంది. ఇలాంటి సమయంలో ఆ సినిమా బాగోలేదు అంటే ఆ నిర్మాతలకు కదా నష్టం. సాటి నిర్మాత అది ఆలోచించడా? మరి ఇది సినిమాని చంపడం కాదా? అని టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. అయినా హిట్ అయిన సినిమాకు నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి ఫైర్ అవ్వాల్సిన అవసరం ఏంటో ఇప్పటికి ఎవ్వరికి అర్ధం కావట్లేదు. ఒకవేళ అందరూ నెగిటివ్ గా రాసి ఫ్లాప్ అంటే సినిమాకి నష్టం జరిగింది అనుకోవచ్చు. కానీ అందరూ పాజిటివ్ రివ్యూలు ఇచ్చి, సినిమా హిట్ అయి కలెక్షన్స్ వచ్చినా ఇలా నాగవంశీ ఫైర్ అవ్వడంతో అర్ధం లేదు అంటున్నారు మీడియా వాళ్ళు.
Also Read : Chiranjeevi : మొన్న వెంకటేష్.. ఇప్పుడు చిరంజీవి.. ఆ విషయంలో అనిల్ రావిపూడి ప్లానింగ్ మాములుగా లేదుగా..