John Cena : దుస్తుల్లేకుండా ఆస్కార్ వేదికపై జాన్ సీనా రచ్చ.. వీడియో వైరల్
John Cena : ప్రతిష్టాత్మకమైన 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం అర్ధరాత్రి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగింది.
- Author : Pasha
Date : 11-03-2024 - 10:38 IST
Published By : Hashtagu Telugu Desk
John Cena : ప్రతిష్టాత్మకమైన 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం అర్ధరాత్రి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ సినీ అవార్డుల ఉత్సవాన్ని ప్రపంచమంతా ఆసక్తిగా చూసింది. ఆస్కార్స్ వేదికపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. ఈసారి కూడా అభిమానులకు ఒక షాక్ తగిలింది. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ రెజ్లర్ జాన్ సీనా నగ్నంగా స్టేజీపైకి వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
#JohnCena presented the #Oscar for Best Costume Design NAKED 😂🥵 https://t.co/r7WoNDVle4 (🎥: ABC) pic.twitter.com/BO4coRLTFA
— TMZ (@TMZ) March 11, 2024
We’re now on WhatsApp. Click to Join
సాధారణంగా ఇలాంటి మెగా ఈవెంట్‌కు వస్తే స్టైలిష్ దుస్తుల్లో వస్తుంటారు. కానీ జాన్ సీనా మాత్రం నగ్నంగా వచ్చాడు. అయితే దీనికి ఒక కారణం ఉంది. ఈసారి అస్కార్ వేడుకల్లో బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డును ప్రదానం చేసే అవకాశాన్ని జాన్ సీనాకు(John Cena) ఇచ్చారు. ఈ అవార్డును ప్రజెంట్ చేయడానికి స్టేజీపైకి రావాల్సిందిగా జాన్ సీనాను హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ ఆహ్వానించారు. ఇక్కడే అందరికీ షాక్ ఇచ్చాడీ స్టార్ రెజ్లర్. నగ్నంగా ఎంట్రీ ఇచ్చిన జాన్ సీనాను చూసి అందరూ షాక్ తిన్నారు. ఆ తర్వాత కోలుకొని తెగ నవ్వుకున్నారు. దీనికి కారణం జాన్ సీనా ఒంటిపై నూలుపోగు కూడా లేకపోవడం. తన ప్రైవేట్ పార్ట్ కనిపించకుండా మాత్రం అడ్డుగా విన్నర్ పేరు ఉన్న కార్డు పెట్టుకొని వచ్చాడు. సినిమాల్లో కాస్టూమ్ డిజైనర్ ఎంత అవసరమో తెలిసింది అనే తన కామెంట్ తో జాన్ సీనా అందరినీ నవ్వించాడు. ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చి బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డు నామినీల జాబితాను అనౌన్స్ చేశాడు.
Also Read : Fastest Router : దేశంలోనే స్పీడ్ రూటర్ రెడీ.. ఇంటర్నెట్ వేగం సెకనుకు 2,400 జీబీ
బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డు రేసులో బార్బీ, కిల్లర్స్ ఆఫ్ ఫ్లవర్ మూన్, నెపోలియన్, ఓపెన్‌హైమర్, పూర్ థింగ్స్ మూవీస్ నిలిచాయని ప్రకటించారు. నామినీల వీడియోను బిగ్ స్క్రీన్ పై ప్లే చేస్తుండగానే జాన్ సీనా స్టేజ్ పైనే డ్రెస్ వేసుకోవడం విశేషం. బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డుల నామినీల వీడియోలు ప్లే చేసే సమయంలో స్టేజ్ పై లైట్లన్నీ ఆర్పేశారు. ఆ సమయంలో నలుగురైదుగురు వ్యక్తులు వేగంగా వచ్చి జాన్ సీనాకు ఓ డ్రెస్ ఇచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత అతడు డ్రెస్ వేసుకొని.. విజేతను అనౌన్స్ చేశాడు. చివరకు ‘పూర్ థింగ్స్’ చిత్రానికి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు వచ్చిందని జాన్ సీనా వెల్లడించాడు. ఇక ఓపెన్ హైమర్ సినిమాకు కూడా అవార్డుల పంట పండింది. గతేడాది భారత్‌కు ఆస్కార్ చాలా ప్రత్యేకం. భారతీయ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. అదే విధంగా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కూడా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఆస్కార్ వేడుకలో ఈసారి ఇండియాకు నిరాశే ఎదురైంది. బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో నామినేట్ అయిన టు కిల్ ఎ టైగర్ కు కూడా అవార్డు దక్కలేదు.