Valentine’s Day Special : మరోసారి థియేటర్స్ లోకి ‘ఆరెంజ్’
Valentine's Day Special : ఈ సినిమా ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకున్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమైంది
- Author : Sudheer
Date : 23-01-2025 - 12:40 IST
Published By : Hashtagu Telugu Desk
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ప్రేమకథ చిత్రం ‘ఆరెంజ్’ మరోసారి థియేటర్స్ లలో సందడి చేయబోతుంది. వాలంటైన్స్ డే (Valentine’s Day) సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం రీరిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ షోప్ ఉంటాయని వెల్లడించాయి.
అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాగబాబు (Nagababu) నిర్మించిన ‘ఆరెంజ్’ (Orange)లో రామ్ చరణ్ (Ram Charan) కు జంటగా జెనీలియా (Genelia) నటించింది. 2010లో భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ సినిమా ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకున్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమైంది.
Republic Day 2025 : గణతంత్ర పరేడ్లో ఏపీ శకటం
ప్రజెంట్ జనరేషన్‌కు మాత్రం ఈ సినిమా చాలా బాగా నచుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ‘ఆరెంజ్’ మూవీని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా రీరిలీజ్ చేయబోతున్నారు. మొదటిసారి విడుదలైనపుడు డిజాస్టర్ టాక్ తెచ్చుకుని నిర్మాతను ఆర్థికంగా నష్టపరిచిన ఈ మూవీ.. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా రీసెంట్ గా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ ప్లాప్ మూటకట్టుకున్నాడు. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు.