Adipurush Controversy: ‘ఆదిపురుష్’ పూర్తి రామాయణం కాదు: ఓం రౌత్
'ఆదిపురుష్' ఆది నుంచే వివాదాల్లో చిక్కుకుంది. సినిమా కథ మొదలు విడుదలైన తరువాత కూడా ఆదిపురుష్ ను వివాదాలు వదలడం లేదు.
- By Praveen Aluthuru Published Date - 03:28 PM, Sat - 17 June 23

Adipurush Controversy: ‘ఆదిపురుష్’ ఆది నుంచే వివాదాల్లో చిక్కుకుంది. సినిమా కథ మొదలు విడుదలైన తరువాత కూడా ఆదిపురుష్ ను వివాదాలు వదలడం లేదు. సినిమాలోని డైలాగ్స్‌పై చాలా వరకు రచ్చ క్రియేట్ చేశాయి. దీంతో పాటు సినిమాలో రామాయణం కథ కంటే యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఇప్పుడు ఈ వివాదాలపై దర్శకుడు ఓం రౌత్ మౌనం వీడాడు. ఈ సందర్భంగా విమర్శకులకు ఓం రౌత్ క్లారిటీ ఇచ్చాడు.
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్’ నిన్న శుక్రవారం విడుదలైంది. రిలీజైన అన్ని సెంటర్లలో చిత్రంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కథని టార్గెట్ చేస్తుంటే మరికొందరు గ్రాఫిక్స్ ను హైలెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. మొత్తానికి ఆదిపురుష్ విడుదల తరువాత కూడా విమర్శలను మూటగట్టుకుంది.
తాజాగా ఓం మాట్లాడుతూ.. “రామాయణం చాలా పెద్దది. ‘ఆదిపురుష్’ సినిమా పూర్తి రామాయణం కాదని, ఇది ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. ఇదివరకు మనం టీవీలో చూసిన రామాయణం నేను చెప్పేది. దీనిని సినిమా రామాయణం అని పిలవలేము. అందుకే దీనిని ఆదిపురుష్ అని పిలుస్తున్నాం. ఎందుకంటే ఇది రామాయణంలోని ఒక విభాగం మాత్రమే. ఇది ఒక యుద్ధ ఘట్టం. రామాయణ యుద్ధంలో చిన్న భాగం మాత్రమేనని అన్నారు దర్శకుడు. మొత్తానికి ‘ఆదిపురుష’ తొలిరోజే రికార్డులు బద్దలు కొడుతుండగా మరోవైపు సినిమాపై వివాదం తలెత్తింది.
Read More: Venkaiah Naidu: చట్టాలను న్యాయవ్యవస్థ చేయలేదు: వెంకయ్య నాయుడు