Priyanka : వాళ్ళు బలవంతం చేస్తారు.. ఈ మార్పుకు కారణం అదే..!
Priyanka నాని తో గ్యాంగ్ లీడర్ సినిమా చేసిన ప్రియాంక అరుల్ మోహన్ ఆ సినిమాతో పాటుగా శర్వానంద్ తో శ్రీకారం సినిమా చేసింది. చెన్నై చిన్నదే అయినా తెలుగు సినిమాల మీద ఆసక్తి
- By Ramesh Published Date - 10:56 AM, Wed - 1 November 23

Priyanka నాని తో గ్యాంగ్ లీడర్ సినిమా చేసిన ప్రియాంక అరుల్ మోహన్ ఆ సినిమాతో పాటుగా శర్వానంద్ తో శ్రీకారం సినిమా చేసింది. చెన్నై చిన్నదే అయినా తెలుగు సినిమాల మీద ఆసక్తి కనబరుస్తున్న ప్రియాంకాకు ఒకేసారి మెగా ఆఫర్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో OG సినిమాలో జత కట్టే ఛాన్స్ అందుకుంది అమ్మడు. ఈ సినిమా తర్వాత నాని (Nani) తో వివేక్ ఆత్రేయ చేస్తున్న సినిమాలో కూడా ప్రియాంకా ఛాన్స్ అందుకుంది.
ఆల్రెడీ కోలీవుడ్ లో శివ కార్తికేయన్ (Siva Karthikeyan), సూర్య లాంటి స్టార్స్ తో నటించిన ప్రియాంకా అక్కడ కూడా తన ఫాం కొనసాగిస్తుంది. అయితే తెలుగులో కూడా స్టార్ రేంజ్ కి వెళ్లాలని చూస్తుంది అమ్మడు. ఇక ఈమధ్య కాస్త బొద్దుగా కనిపిస్తున్న అమ్మడు దానికి కారణం కూడా చెప్పింది.
Also Read : Nani : మృణాల్ లో ఏదో మ్యాజిక్ ఉంది.. హీరోయిన్ ని పొగిడేస్తున్న స్టార్ హీరో..!
తనకు స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి వాటిని ఎక్కువగా తింటాను అయితే అందుకే ఈమధ్య కాస్త బొద్దుగా మారానని చెప్పింది ప్రియాంకా అంతేకాదు తన ఫ్రెండ్స్ కూడా తనకు బలవంతంగా స్వీట్స్ తినిపిస్తారని అంటుంది.
హీరోయిన్ గా కాస్త కూస్తో ఫిజికల్ మెయింటెనెన్స్ ఉండాలి. అయితే ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి కదా పర్లేదు అనిపిస్తుంది కానీ అవకాశాలు రాని టైం లో ఈ ఫిజిక్ ఆమెకు ఇబ్బందిగా మారుతుంది. స్లిం గా మారేందుకు తన ప్రయత్నాలు చేస్తున్నాని అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంకా అరుల్ మోహన్.
ఓజీ సినిమా తర్వాత ప్రియాంకాకు తెలుగులో కచ్చితంగా స్టార్ ఛాన్స్ లు వస్తాయని చెప్పొచ్చు. అంతేకాదు ప్రియాంకా అరుల్ మోహన్ నానితో సెకండ్ మూవీ చేయడం కూడా ఆమె కెరీర్ కు బాగా హెల్ప్ అవుతుంది. మరి ఈ రెండు సినిమాల తర్వాత ప్రియాంకా కెరీర్ టాలీవుడ్ లో ఎలా దూసుకెళ్తుందో చూడాలి.
We’re now on WhatsApp : Click to Join