OG 2nd Song : ‘OG’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్
OG 2nd Song : 'ఓజీ' సినిమా నుంచి విడుదలైన ఈ రెండవ పాట ఒక రొమాంటిక్ మెలోడీ. 'ఫైర్ స్టార్మ్' పాటలో పవన్ కళ్యాణ్ మాస్ స్టైల్ చూసి ఆకట్టుకున్న అభిమానులకు, ఈ కొత్త పాటలో ఆయనలోని కొత్త కోణాన్ని చూసే అవకాశం లభించింది.
- By Sudheer Published Date - 11:12 AM, Wed - 27 August 25

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan )అభిమానులకు ‘ఓజీ'(OG) చిత్ర బృందం మరోసారి సంతోషాన్ని పంచింది. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ నుంచి రెండవ పాటను విడుదల చేశారు. ఈ పాట ‘సువ్వీ సువ్వీ సువ్వాలా.. సూదంటూ రాయే పిల్లా..’ అంటూ సాగుతూ శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తోంది. థమన్ సంగీతం అందించిన ఈ పాట, ఇప్పటికే విడుదలైన ‘ఫైర్ స్టార్మ్’ సాంగ్‌లాగే చార్ట్‌బస్టర్‌గా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి.
Jammu Kashmir : వైష్ణో దేవి ఆలయ మార్గంలో విరిగిపడిన కొండచరియలు..30కి చేరిన మృతులు
‘ఓజీ’ సినిమా నుంచి విడుదలైన ఈ రెండవ పాట ఒక రొమాంటిక్ మెలోడీ. ‘ఫైర్ స్టార్మ్’ పాటలో పవన్ కళ్యాణ్ మాస్ స్టైల్ చూసి ఆకట్టుకున్న అభిమానులకు, ఈ కొత్త పాటలో ఆయనలోని కొత్త కోణాన్ని చూసే అవకాశం లభించింది. తమన్ సంగీతం, పాట సాహిత్యం ఈ మెలోడీకి కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. ఈ పాట సినిమా కథలో ఒక ముఖ్యమైన సందర్భంలో వస్తుందని భావిస్తున్నారు. పాట విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది.
‘ఓజీ’ సినిమాపై ఇప్పటికే చాలా అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించే అవకాశం ఉందని అభిమానులు నమ్ముతున్నారు. ఈ సినిమా వచ్చే నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. పాటలు, టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ‘ఓజీ’ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోతుందని ఆశిస్తున్నారు. అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.