NTR Wife: చార్మినార్ లో షాపింగ్ చేసిన ఎన్టీఆర్ భార్య.. ఫిదా అవుతున్న నెటిజన్స్?
మామూలుగా ఒక హోదాలో ఉన్నవాళ్లు ఏ విషయంలోనైనా హై క్లాస్ లో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు తినే ఫుడ్ నుంచి కట్టుకునే బట్టల వరకు ప్రతిదీ రిచ్ గా
- By Anshu Published Date - 05:56 PM, Mon - 17 April 23

NTR Wife: మామూలుగా ఒక హోదాలో ఉన్నవాళ్లు ఏ విషయంలోనైనా హై క్లాస్ లో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు తినే ఫుడ్ నుంచి కట్టుకునే బట్టల వరకు ప్రతిదీ రిచ్ గా ఉండాలని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు, వారి ఫ్యామిలీ మెంబర్స్ బాగా రిచ్ గా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అటువంటిది కాబట్టి.
అయితే మంచి బ్యాగ్రౌండ్ ఉండి.. పైగా భర్త గ్లోబల్ స్టార్ అయి ఉండి కూడా చిన్న బజార్ లో షాపింగ్ చేస్తూ కనిపించింది ఎన్టీఆర్ భార్య. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గురించి, ఆయన ఫ్యామిలీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్.
ఇక ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ సినిమాలకే కాకుండా ఫ్యామిలీకి కూడా మంచి సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఇక ఆయన గతంలో లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇక లక్ష్మీ ప్రణతి అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఆమె సినీ ఈవెంట్స్ లలో కూడా పెద్దగా కనిపించదు. ఎక్కువగా లో ప్రొఫైల్ ను మెయింటైన్ చేస్తూ ఉంటుంది ప్రణతి. ఇక ఈమెకు సోషల్ మీడియా కూడా అంతగా టచ్ లేనట్లే ఉంది.
ఏదైనా సందర్భం ఉంటేనే లక్ష్మీ ప్రణతి ఫోటో షేర్ చేస్తూ ఉంటాడు ఎన్టీఆర్. అంతకుమించి మనకు ప్రణతి ఎక్కడ కనిపించదు. అయితే ప్రస్తుతం రంజాన్ సీజన్ కాబట్టి హైదరాబాద్ చార్మినార్ లో నైట్ బజార్ షాపింగ్ కు జనాలు బాగా ఎగబడుతూ ఉంటారు. అయితే తాజాగా ప్రణతి కూడా నైట్ బజార్ లో షాపింగ్ చేస్తూ కనిపించింది. ఇక దానికి సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీంతో ఆ ఫోటో చూసిన జనాలు.. ఇంత స్టార్ స్టేటస్ ఉండి కూడా ప్రణతి ఇంత సింపుల్ గా ఉండటంతో ఫిదా అవుతున్నారు