Devara Interview : సిద్ధూ, విశ్వక్ లతో ఎన్టీఆర్ దేవర స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో వచ్చేసింది.. ఫుల్ కామెడీ..
తాజాగా సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లు కలిసి ఎన్టీఆర్, కొరటాల శివని చేసిన ఇంటర్వ్యూ ప్రోమోని రిలీజ్ చేసారు.
- By News Desk Published Date - 04:06 PM, Thu - 19 September 24

Devara Interview : ఎన్టీఆర్ దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వచ్చిన మూడు సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఇక మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇటీవల దేవర టీమ్ – సందీప్ రెడ్డి వంగతో చేసిన ఇంటర్వ్యూ రిలీజ్ చేసారు.
తాజాగా సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లు కలిసి ఎన్టీఆర్, కొరటాల శివని చేసిన ఇంటర్వ్యూ ప్రోమోని రిలీజ్ చేసారు. ఈ ప్రోమో చూస్తుంటే ఇంటర్వ్యూ ఆద్యంతం కామెడీగా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రోమో కూడా ఫుల్ కామెడీగా సాగింది. ఇందులో.. ఎన్టీఆర్ దేవరకు అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పినట్టు రివీల్ చేసారు. దీంతో ఈ ఫుల్ ఇంటర్వ్యూ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీరు కూడా ఈ ఇంటర్వ్యూ ప్రోమో చూసేయండి..
Also Read : Nagababu : జానీ మాస్టర్ ఇష్యూ పై నాగబాబు , మంచు మనోజ్ ల రియాక్షన్