Devara : దేవర పని అయిపోయింది.. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తారక్
ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.
- By News Desk Published Date - 06:39 AM, Wed - 14 August 24

Devara : ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో ఉన్నాడు. తాజాగా దేవర షూటింగ్ సెట్స్ లో ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి.. దేవర పార్ట్ 1 షూటింగ్ అయిపోయింది. ఈ జర్నీ చాలా అద్భుతమైనది. సముద్రం ప్రేమను, ఈ టీమ్ ని ఇకపై చాలా మిస్ అవుతాను. శివ చేతిలో అద్భుతంగా తయారయిన ఈ సినిమాని సెప్టెంబర్ 27న చూడటానికి అప్పటిదాకా వెయిట్ చేయలేకపోతున్నాను అని పోస్ట్ చేసాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ పోస్ట్ వైరల్ చేస్తున్నారు.
RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర తోనే వస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్(Janhvi Kapoor) జంటగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా ఫుల్ మాస్ సినిమాగా ఈ దేవర సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన సాంగ్స్, గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి దేవర సినిమా ప్రేక్షకులని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
Also Read : Astrologer Venu Swamy : మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేసిన వేణుస్వామి భార్య